Home » పచ్చ బొట్టేసిన – బాహుబలి : ది బిగినింగ్

పచ్చ బొట్టేసిన – బాహుబలి : ది బిగినింగ్

by Kusuma Putturu
0 comments
pachha bottesina song lyrics baahubali  the beginning

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా 

జంటకట్టేసిన తుంటరోడ నీతో

కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా 

వేయి జన్మాల ఆరాటమై 

వేచి ఉన్నానే నీ ముందర 

చేయి నీ చేతిలో చేరగా 

రెక్క విప్పిందే నా తొందర… 

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా… 

మాయగా నీ సోయగాలాలు వేసి 

నన్నిలా లాగింది నువ్వే హలా 

కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా 

హత్తుకుపో నను ఊపిరి ఆగేలా 

బాహు బంధాల పొత్తిళ్లలో…విచ్చుకున్నావే ఓ మల్లిక… 

కోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో…పురి విప్పింది నా కోరిక… 

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా… 

కానలో నువు నేను ఒకమేను కాగా 

కోనలో ప్రతి కొమ్మ మురి సేనుగా 

మరుక్షణమే ఎదుర్తెనా మరణము కూడా పరవశమే 

సాంతం నేనీ సొంతము అయ్యాకా 

చెమ్మ చేరేటి చెక్కిళ్లలో…చిందులేసింది సిరివెన్నెల… 

ప్రేమ ఉరేటి నీ కళ్లలో…రేయి కరిగింది తెలిమంచులా… 

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో 

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా 

జంటకట్టేసిన తుంటరోడ నీతో 

కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా 

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.