Home » ఊసుపోదు – ఫిదా

ఊసుపోదు – ఫిదా

by Haseena SK
0 comment

ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెల్లనీదు
ఇంత ఖైదు నాకిలాఏమిటో

సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరి రాదు
చింతపోదు నాకిలాఏమిటో

ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదువెళ్లినీదు
ఇంత ఖైదు నాకిలా ఏమిటో

సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరి రాదు
చింతపోదు నాకిలా ఏమిటో

నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతోందె
తప్పేన ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరికుతోందే
ఆగేదేనా అరె ఈ ఆలోచనా
నీ తలపులే వొదలవే
నన్ను నిదురలోను
ఆ మలుపులో తెలియక
నన్నే వెతికినాను

వల్ల కాదు పాలు పోదు
ఆగనీదు సాగనీదు
వెంట రాదు నాకిలా ఏమిటో
వేళకాదు వీలు లేదు
ఊహ కాదు ఓర్చు కోదు
చెంత లేదు నాకిలా ఏమిటో

నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతోందే
తప్పేన ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరికుతోందే
ఆగేదేనా అరె ఈ ఆలోచనా
నీ తలపులే వొదలవే
నన్ను నిదురలోను
ఆ మలుపులో తెలియక
నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదొనాడు నీతో చెప్పెయనా

నీ పిలిపులే కలలుగా నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదొనాడు నీతో చెప్పెయనా

నీ తలపులే వొదలవే
నీ తలపులే వొదలవే

ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెల్లనీదు
ఇంత ఖైదు నాకిలాఏమిటో

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment