Home » చెంగ‌ల్వ చేయందేనా సాంగ్ లిరిక్స్ – భారతీయుడు 2

చెంగ‌ల్వ చేయందేనా సాంగ్ లిరిక్స్ – భారతీయుడు 2

by Rahila SK
0 comment

చెంగ‌ల్వ చేయందేనా
చెలికాని చేరేనా
నిజ‌మేనా నిశాంత‌మేనా
సంద్రాలు రుచి మార్చేనా
మ‌ధురాలు పంచేనా
ఇది వేరే ప్ర‌పంచ‌మేనా

స‌మీప దూరాల నిర్ణ‌యం
గ‌తాల గాయం
ఈ వేళ నీ రాక‌తో
జ‌యం నిరంతరాయం

వ‌రించు ఉత్సాహ‌మేదో
పుంజుకున్న నీ పెదాల‌కు
త‌రించు ఉల్లాస లాలి పాడనీక
మోము దాచ‌కూ ఊ ఊ

మారే మ‌న‌సుల‌లో ఏమీ ఇంద్ర‌జాలం
తీరే త‌ప‌న‌ల‌కు దేహం చంద్ర‌యానం
ఆరంభం ఈ ప‌య‌నం

నేనెవ్వరో తెలిసినా అడగనిక
మనస్సులో మనసునే
నువెవ్వరో వెతికినా కనపడని
సరస్సులో చినుకువే

కరిగెనే సగం వెలితి నా జగం
అవసరం మరో నేనూ
ఎడమయ్యే గుణం ముడిపడే క్షణం
ప్రియవరం అదే నీవు

అందినా అందనన్న నిన్నలన్ని
క్షేమమే కదా
వసంతమై చెంత చేరి
నా జతైన సీతలా పదా

మారే మ‌న‌సుల‌లో ఏమీ ఇంద్ర‌జాలం
తీరే త‌ప‌న‌ల‌కు దేహం చంద్ర‌యానం
కలలు మారే మ‌న‌సుల‌లో ఏమీ ఇంద్ర‌జాలం
తీరే త‌ప‌న‌ల‌కు దేహం చంద్ర‌యానం
ఆరంభం ఈ ప‌య‌నం

స‌మీప దూరాల నిర్ణ‌యం
గ‌తాల గాయం
ఈ వేళ నీ రాక‌తో
జ‌యం నిరంతరాయం

మారే మ‌న‌సుల‌లో ఏమీ ఇంద్ర‌జాలం
తీరే త‌ప‌న‌ల‌కు దేహం చంద్ర‌యానం
కలలు మారే మ‌న‌సుల‌లో ఏమీ ఇంద్ర‌జాలం
తీరే త‌ప‌న‌ల‌కు దేహం చంద్ర‌యానం

మారే మ‌న‌సుల‌లో ఏమీ ఇంద్ర‌జాలం
తీరే త‌ప‌న‌ల‌కు దేహం చంద్ర‌యానం
కలలు మారే మ‌న‌సుల‌లో ఏమీ ఇంద్ర‌జాలం
తీరే త‌ప‌న‌ల‌కు దేహం చంద్ర‌యానం
ఆరంభం ఈ ప‌య‌నం


పాట: చెంగ‌ల్వ చేయందేనా
దర్శకుడు: ఎస్.శంకర్
చిత్రం: భారతీయుడు 2 (2024)
సంగీతం: అనిరుధ్ రవిచందర్
గాయకులు: ఏబీ వి, శృతిక సముద్రాల
గీతరచయిత: రామజోగయ్య సాత్రి
తారాగణం: సిద్ధార్థ్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment