Home » చిట్టి అడుగు – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

చిట్టి అడుగు – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

by Haseena SK
655 views
chitti adugu song lyrics

ఓ సోనియే ఓ సోనియే ఓ సోనియే

అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగు

సరిలే ఇపుడైనా
తెలిసిందిగా తొలిసారి
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక

ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
ఊరేగించిన ఈ లోకం
తన బరువు తానే సరిగా
మోయలేని ఓ మాలోకం

ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగు
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక

శిలలాంటి నిన్ను ఇలా శిల్పంగా మలిచింది
ఆ నవ్వులో చురకలే
నీ సొంత కలలాగా నీ కంట నిలిచింది
ఆ దివ్వెలో మెరుపులే

అచ్చంగా తనలా ఉందా
అద్దం చూపే నీ రూపం
నీ సొంత చిరునామాలా
కనిపిస్తోందా ఈ మలుపు

ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగు
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక

ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని బంధమేదో
ఎదురైంది నీ దారిలో ఓ ఓ
మాటలకందని భావం మనసెలా గుర్తిస్తుందో
తెలిసింది ఆ చెలిమితో

ఇంకెవరి కల్లో చూసే
కలవే నువ్వు ఇన్నాళ్లు
ఎంత బాగుందో చూడు
నీ తొలి వేకువ ఈనాడు

ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగు
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక

అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగు

సరిలే ఇపుడైనా
తెలిసిందిగా తొలిసారి
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక

ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
ఊరేగించిన ఈ లోకం
తన బరువు తానే సరిగా
మోయలేని ఓ మాలోకం

ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగు
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక

ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగు
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక

ఓ సోనియే హే హే ఏ ఏ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.