Home » ముత్యాల ధారని – 7th సెన్స్ 

ముత్యాల ధారని – 7th సెన్స్ 

by Hari Priya Alluru
0 comment

ముత్యాల ధారని మురిపించే రేయిని

నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై

తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ

విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే

కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని

నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై

తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

ఓ అలలా ఓ సుమఝరిలా ఓ

కదులుతున్న నీ కురులందే నే దాగనా

వరించేటి వెన్నెల నీడై పులకించనా

అరె వెన్నే తాకాలంటు మేఘం దాహంతోటి పుడమే చేరెనా

వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటు కడలే చేరెనా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ

విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

ఓ ఓ రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే

కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

కలనైనా ఓ క్షణమైనా

నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం

నిన్నే కోరుకుందే నాలో ఆరాటం

పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా

క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లేదామ్మా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ

విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా

రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే

కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని

నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ

పుష్పించే తోటలో పులకించే గాలినై

తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment