Home » ఎత్తర జెండా – RRR

ఎత్తర జెండా – RRR

by Vinod G
507 views
ettara jendaa song lyrics rrr

పాట: ఎత్తర జెండా
సినిమా: RRR (2022)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, M.M కీరవాణి, సాహితీ చాగంటి, హరికా నారాయణ్
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి


ettara jendaa RRR

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె… ఒంగోలు కోడే
సిరిగల కోడే… సిరిసిల్ల కోడే

హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే… కలకత్తా కోడే
గుజ్జగల కోడే… గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే గిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా

చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)
పంతమున్న కోడే… పంజాబి కోడే
తగ్గనన్న కోడే టంగుటూరి కోడే
పౌరుషాల కోడే పల్లాస్సి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.