Home » ఏం పాపమో (Yem Papamo) సాంగ్ లిరిక్స్ – Love Failure Full Song

ఏం పాపమో (Yem Papamo) సాంగ్ లిరిక్స్ – Love Failure Full Song

by Lakshmi Guradasi
772 views
Yem Papamo song lyrics love failure song

పెంచుకున్న ప్రేమ పెరిగి పెద్దదాయే
నీ తోడుగా నడిచే స్నేహమే ప్రేమయే
ఇన్నాళ్లు నా ప్రాణము
నీకోసం తలాడినే
నీ మనసులో నాపై నీకున్న అభిప్రాయం
అన్నాడే తెలుసుంటే
ఈనాడు నాకింకా ఈ బాధ లేకుండునే
నా గుండేందుకు బరువు అవునే

మనసులో ఉన్న మాటని
చెప్పలేక నలిగిపోతిని
నన్ను నేను ఓడించుకుంటూ
నిన్నే గెలిపిస్తినే

ఒక్కగానొక్క నా చిన్ని ప్రాణం
చిత్రహింస అనుభవిస్తూనే
చిత్రంగా చితి మంటపాలవా
నా తనువు సిద్ధమాయెనే
సిద్ధమాయెనే

ఏం పాపమో ఏం గోరమో
నా ఎదకు ఇంత కష్టం
నే ఎంతగా వద్దనుకున్నా
తగ్గదమ్మా నీ పైన ఇష్టం

ఏం పాపమో ఏం గోరమో
నా ఎదకు ఇంత కష్టం
నే ఎంతగా వద్దనుకున్నా
తగ్గదమ్మా నీ పైన ఇష్టం

కడదాకా నా కంటి చూపులోన
పదిలంగా నిన్నే దాచుకుంటా
యెనలేని నా ప్రేమ నీకు పంచానమ్మా
ప్రాణంగా నిన్నే ప్రేమించానమ్మా

కడదాకా నా కంటి చూపులోన
పదిలంగా నిన్నే దాచుకుంటా
యెనలేని నా ప్రేమ నీకు పంచానమ్మా
ప్రాణంగా నిన్నే ప్రేమించానమ్మా
దయలేని ఆ దేవుడు ఆటలాడుతున్నాడు
నీకు నాకు మధ్య ఎంత ఎడబాటు చేసినాడు
నీకై కన్నా కలలే చెదిరి పొయ్యినిపుడు
నా తోడు నువ్వు లేకుంటే
ఆగుతుందే గుండె సప్పుడు
భరించలేనంత ఈ వేదన బాధ
నాకెందుకే ఇప్పుడు
నాకెందుకే ఇప్పుడు

ఏం పాపమో ఏం గోరమో
నా ఎదకు ఇంత కష్టం
నే ఎంతగా వద్దనుకున్నా
తగ్గదమ్మా నీ పైన ఇష్టం

ఏం పాపమో ఏం గోరమో
నా ఎదకు ఇంత కష్టం
నే ఎంతగా వద్దనుకున్నా
తగ్గదమ్మా నీ పైన ఇష్టం

ఉన్నంత బతుకు నీకోసమే
మొత్తంగా నీకె ఇచ్చుకుంటా
ఒక్కింత నా తనువు అణువణువు
నీలోన నింపేనే నా రూపు
ముద్దుగుమ్మ..

ఉన్నంత బతుకు నీకోసమే
మొత్తంగా నీకె ఇచ్చుకుంటా
ఒక్కింత నా తనువు అణువణువు
నీలోన నింపేనే నా రూపు
ముద్దుగుమ్మ..

కన్నీటి అంచులోన నన్నుంచి పొయ్యినవే
పడిగాపులే గాసిన నీ నవ్వు చూడాలనే
అడిగుంటే ఇచ్చేదునే
నువ్వు కోరింది ఏమైనా
నీకొరకే బతుకుతున్న
నా ప్రాణాలు నిక్కివ్వనా
నరకాన్ని చూపించి నానిట్ఠా వేధించి
కక్షా గడితివెందుకే

ఏం పాపమో ఏం గోరమో
నా ఎదకు ఇంత కష్టం
నే ఎంతగా వద్దనుకున్నా
తగ్గదమ్మా నీ పైన ఇష్టం

ఏం పాపమో ఏం గోరమో
నా ఎదకు ఇంత కష్టం
నే ఎంతగా వద్దనుకున్నా
తగ్గదమ్మా నీ పైన ఇష్టం

_________________________________________
సాహిత్యం: కళ్యాణ్ సుమిత్ర (Kalyan Sumithra)
గాయకుడు: అజయ్ మెంగాని (Ajay Mengani)
సంగీతం: ఇంద్రజిత్ (Indrajitt)
నటీనటులు : విశ్వ ప్రియ (Vishwa Priya) & శివకృష్ణ వెలుతురు (ShivaKrishna Veluthuru)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.