Home » (Ole Ole) ఓలే ఓలే (Jathara) సాంగ్ లిరిక్స్ – రేవు (Revu)

(Ole Ole) ఓలే ఓలే (Jathara) సాంగ్ లిరిక్స్ – రేవు (Revu)

by Vinod G
0 comment

(బలి బలి కోబలి
బలి బలి కోబలి
బలి బలి కోబలి)

ఓలే ఓలే ఓలే…… ఓలే ఓలేయ
ఓలే ఓలే ఓలేయ…
ఓలే ఓలే ఓలే…… ఓలే ఓలేయ
ఓలే ఓలే ఓలేయ…

దండం పెట్టి కోర్కెలు కోరి
అమ్మకు మొక్కిన మొక్కులు తీరి
పండగపూట పచ్చని దారి
వేయగ వచ్చిన జాతరలో

దండం పెట్టి కోర్కెలు గోరి
అమ్మకు మొక్కిన మొక్కులు తీరి
పండగపూట పచ్చని దారి
వేయగ వచ్చిన జాతరలో

పూజలు చేద్దాం పువ్వులు వేద్దాం
హారతులిద్దాం ఆర్తులు విందాం

నిద్దుర లేచి పొంగలి చేసి
చిన్నా పెద్దకు నీళ్ళే పోసి
కుంకుమరాసి దిస్టే తీసి
కదిలొచ్చిన్న ఊరు వాడ

నిద్దుర లేచి పొంగలి చేసి
చిన్నా పెద్దకు నీళ్ళే పోసి
కుంకుమరాసి దిస్టే తీసి
కదిలొచ్చిన్న ఊరు వాడ

కదిలొచ్చిన్న ఊరు వాడ
ఏకం అయిన జాతరలో
సందడి చేద్దాం సంబర పడదాం
సందడి చేద్దాం సంబర పడదాం

రగతం మరిగిన రాక్షసత్వము
జాలే ఎరుగని క్రూర మృగము
కోరలు చాచి కాచుకూచున్న
రక్కసి మూకలు టక్కరి నక్కలు
జబ్బలు చరిచే జాతర్లో..
జరిగే వైనం అమ్మకు చోద్యం
జరిగే వైనం అమ్మకు చోద్యం


చిత్రం: రేవు (Revu)
పాట పేరు: (Ole Ole) ఓలే ఓలే (Jathara) సాంగ్
సంగీతం: జాన్ కె జోసెఫ్
సాహిత్యం: ఇమ్రాన్ శాస్త్రి
గాయకులు: జాన్ కె జోసెఫ్
దర్శకత్వం: హరినాథ్ పులి
తారాగణం: వంశీరామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి తదితరులు.

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment