నీ ఊపిరి నీ సొంతమా…
మాకు చెప్పకుండా వదలకు… రా …
నీ జీవితం నీ ఇష్టమా…
మాకు వాటా ఉంది మరవకురా…
గాలికో వానకో కూలిపోనియ్యక..
కాపలా కాయగా మేము ఉన్నాముగా
ఆ దేవుడే అడిగినా
నిన్ను పంపం ఒంటిగా
నువు ఎంత పరిగెత్తినా..
మేం వస్తాం వదలకా
ప్రాణాలైనా పందెం వేస్తాం
కాలం పంతం పట్టి నిను వేధిస్తుంటే
ఎన్నాళ్లైనా యుద్ధం చేస్తాం
నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…..
ఓఓఓ… ఓఓఓ… ఓఓఓఓ
కడుపులో తన్నవని
నవ్వింది ఈ తల్లిరా
కట్టెల ఉన్నావని తల్లడిల్లే చూడరా
కదలిరా మిత్రమా అందుకో ఆసరా
బ్రతకరా ప్రతిక్షణం
తోడు ఉన్నామురా…
_____________________
నటీనటులు : విజయ్ తలపతి (Vijay Thalapathy), ఇలియానా (Ileana), జీవా (Jiva), శ్రీకాంత్ (Srikanth)
గాయకుడు: రామకృష్ణ మూర్తి (Ramakrishnan Murthy)
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
సంగీతం: హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.