Home » అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా-అఖండ

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా-అఖండ

by Farzana Shaik
0 comments

మూవీ-అఖండ

సాంగ్– అడిగా అడిగా

లిరిక్స్ -కళ్యాణ చక్రవర్తి

సింగర్స్-స్ పి చరణ్ మరియు ఎం ల్ శృతి

మ్యూజిక్ డైరెక్టర్-తమన్ స్

హీరో– నందమూరి బాలకృష్ణ

హీరోయిన్ -ప్రగ్య జైస్వాల్


అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా-అఖండ

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా

జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా

చిన్న నవ్వే రువ్వి మార్చేసావే నా తీరు నీ పేరుగా

చూపు నాకే చుట్టి కట్టేసావే నన్నేమో సన్నాయిగా

కదిలే కలలే కన్న వాకిళ్ళలో కొత్తగా

కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా

జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా

తక తై తక తకధిమి తకతక తై తక తకధిమి తక

గమమ మపప గస్స గమమ మపప గస్స

సాగరిసని నిస నిదపమ పా పనినిదపమ పా పస నిదపమ పా

పదని పదని పదనిసని గరిని సగరిగమపదనిని

నిసగరి సనిదప మగరిగమదపా నిగపపపా

సరిలేని సమరాలు సరిపోని సమయాలు

తొలిసారి చూశాను నీతో

వీడిపోని విరహాలు వీడలేని కలహాలు

తెలిపాయి నీ ప్రేమ నాతో

ఎల్లలేవి లేని ప్రేమే నీకే ఇచ్చానులే నేస్తమా

వెళ్ళలేనే నేనే నిన్నే దాటి

నూరేళ్ళ నా సొంతమా

కనని వినని సుప్రభాతాల సావాసమా

సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమా

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా

జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా

సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు

కలబోసి కదిలాయి నాతో

మనిషేమో సెలయేరు మనసేమో బంగారు

సరిపోవు నీతో నూరేళ్లు

ఇన్ని నాళ్ళు లేనే లేదే

నాలో నాకింత సంతోషమే

మళ్ళీ జన్మే ఉంటే కావాలంట నీ చెంత ఏకాంతమే

కదిలే కలలే కన్న వాకిళ్ళలో కొత్తగా

కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా

జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment