Home » ఏమే పిల్ల అంటంటే పార్ట్ 2 సాంగ్ లిరిక్స్ – (folk song)

ఏమే పిల్ల అంటంటే పార్ట్ 2 సాంగ్ లిరిక్స్ – (folk song)

by Lakshmi Guradasi
0 comments
yeme pilla part 2 folk song lyrics

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

సిటీ కొట్టి వాడు సైగ చేసి
సిగ్గులన్ని తట్టి లెప్పినాడే

పట్టు పట్టి ఓరా కంట చూసి
నన్నిట్ఠా ఉయ్యాలలూప్పినాడే

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

పొట్టి పొట్టంటూ పిలిచినాడే
పొట్టు పొట్టుగా నచ్చినాడే
ఇట్టా ఇట్టంగా రామన్నాడే
ఏమున్నవే బుట్టబొమ్మ అన్నాడే

పొట్టి పొట్టంటూ పిలిచినాడే
పొట్టు పొట్టుగా నచ్చినాడే
ఇట్టా ఇట్టంగా రామన్నాడే
ఏమున్నవే బుట్టబొమ్మ అన్నాడే

మూసి మూసి నవ్వుల పిల్లగాడే
మనసును మెల్లగా రువ్వినాడే
సన్నటి నడుమున చెయ్యిలేసి
చిన్నదాన నువ్వే చాలన్నడే

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

సోకులా సూపులు నాటినాడే
నా గుండె తలుపులే దాటినాడే
నేనంటే పడిసచ్చే పోటుగాడే
పానమియ్యనికి వెనకాడడే

సోకులా సూపులు నాటినాడే
నా గుండె తలుపులే దాటినాడే
నేనంటే పడిసచ్చే పోటుగాడే
పానమియ్యనికి వెనకాడడే

నవ్వుతాడే వాడు నెలవంకలా
తోడుంటాడే గువ్వగోరింకలా
వానికి లెదమ్మ ఏ వంకరా
పెట్టబోను అన్నాడే ఏ అల్లరా

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

పూత పెట్టినట్టు చైత్రమాసం
కూతపెట్టె వయస్సు వాడి కోసం
వాడి ప్రేమే నాకు నిండు గాసం
లేకుంటే బతుకంతా పాడు మోసం

పూత పెట్టినట్టు చైత్రమాసం
కూతపెట్టె వయస్సు వాడి కోసం
వాడి ప్రేమే నాకు నిండు గాసం
లేకుంటే బతుకంతా పాడు మోసం

ఇంకేది లేదయ్యా అక్కెర
వాడు బతికితే చాలయ్య శంకరా
ఒక్కపొద్దులుంటా ఈశ్వరా
జెర్ర ఒక్కటయేటట్టు చూడరా

ఒట్టుపెట్టుకున్న…
ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

_________________________________________________

పాట: ఏమే పిల్ల అంటంటే (Yeme Pilla Antante)
మ్యూజిక్ : మదీనా స్క్(Madeen SK)
లిరిక్స్: కమల్ ఇస్లావత్ (Kamal Eslavath)
అడిషనల్ లిరిక్స్ &ట్యూన్ : మానుకోట ప్రసాద్ (Manukota Prasad)
సింగర్ : శ్రీలత యాదవ్ (Srilatha Yadav)
తారాగణం: లాస్య జీవం (Lasya Jeevan)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.