Home » సిన్నంగ పోయేటి సిరిమల్లెపువ్వ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

సిన్నంగ పోయేటి సిరిమల్లెపువ్వ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comment

సిన్నంగ పోయేటి సిరిమల్లెపువ్వ నవ్వేటి నా ఎంకి వే ఓ పిల్లా అందాల జాబిల్లివే నా పిల్లా
ఓయెటితోళ్ళ పొగిడిందిసాలు నీ ప్రేమ ఎరుగనులే ఓ పిల్లగా నన్నాగంజేయకురో ఓ పిల్లగా
మానసిచ్చినానే మందారపువ్వా సక్కని సింగిడివే ఓ పిల్లా నచ్చిన నెలవంకవే ఓ పిల్లా
నడిసేటి దారుల్లో నా వెంట రాకు నా ప్రేమ పొందవులే ఓ పిల్లగా నా వెంట నువ్ రాకురో ఓ పిల్లగా

కలల కనిపించావే కలువలపువ్వా కమ్మని మాటలాడి ఓ పిల్లా కనువిందు చేసినవే నా పిల్లా
మాయమాటలాడి ఓ తుంటరోడా నను మాయజేయకురో ఓ పిల్లగా నాతో బాసలాడకు ఓ పిల్లగా
సన్నని నరజాన సంపంగిపువ్వా ముసి ముసి నవ్వులతో ఓ పిల్లా మనసు కొల్లగొట్టకే నా పిల్లా
కొంటె సైగలు జేసే కోరాసు పిల్లవాడ నా సెయ్యివట్టకురో ఓ పిల్లగా మందిలో బదనమురో ఓ పిల్లగా

సొగసైనదాన సన్నజాజిపువ్వా సక్కని చినదానివే ఓ పిల్లా పున్నమి వెన్నెలవే నా పిల్లా
పొగిడేటిమాటలు కోటలుగట్టకు నేనుమురిసిపోనురో ఓ పిల్లగా అంతసులువుగాదురో ఓ పిల్లగా
చక్కని చినదానా చేమంతిపువ్వా చిక్కిన నా రంగివే ఓ పిల్లా చితివరకు తోడుంటనే నా పిల్లా
సక్కని మాటలతో మురిపించినావు నీడోలే తోడుంటావా ఓ పిల్లగా మనువాడ ఒప్పిస్తావా ఓ పిల్లగా

ప్రాణాలనిస్తానే మరుమల్లెపువ్వా మనువాడవొప్పిస్తనే ఓ పిల్లా కడవరకూడుందామే నా పిల్లా
వచ్చేటిరోజుల్లో మాఇంటికొచ్చి మావోళ్లనొప్పియ్యరో ఓ పిల్లగా నా యేలుబట్టుకురో ఓ పిల్లగా
నీ యేలుబట్టుకుంటూ ఓ పిల్లా చితివరకు కూడి ఉంటా నా పిల్లా
చితివరకు తోడుగుంటా ఓ పిల్లగా కడవరకు కూడి ఉంటా నా పిల్లగా
నీ యేలుబట్టుకుంటూ ఓ పిల్లా చితివరకు కూడి ఉంటా నా పిల్లా
చితివరకు తోడుగుంటా ఓ పిల్లగా కడవరకు కూడి ఉంటా నా పిల్లగా


ముసురు ముసురుబట్టి (Vaana Song) సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk Song)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment