Home » ప్రియతమా ప్రియతమా – కొత్త కొత్తగా

ప్రియతమా ప్రియతమా – కొత్త కొత్తగా

by Vinod G
0 comment

చిత్రం: కొత్త కొత్తగా
పాట : ప్రియతమా ప్రియతమా
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
గాయకుడు: సిద్ శ్రీరామ్
సంవత్సరం: 2022


మౌనమే మేఘమై గుండెలో చేరెనే
ప్రాణమే వానల కంటిపై జారెనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో దూరంగా నాకే నే భారంగా
మారాక నేనేందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

కాలం సెగలకు గతమంతా కరిగెనే
శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
ఏ కారణాన్నో ఏకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే

నీదాకా పోలేని పాదాన్ని దూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
జీవించి ఏం లాభం అన్నాయే

ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకు ఏ ఏఏ

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

 

 

You may also like

Leave a Comment