దేవా దేవా పాట సినిమాలో రణబీర్ కపూర్ (శివ) తన ఆధ్యాత్మిక శక్తులను గుర్తించడానికి, స్వీయ అన్వేషణలో తేలిపోతున్న సమయంలో వస్తుంది. ఇందులో అతను తన శక్తుల మూలాన్ని తెలుసుకుంటూ, తనలో ఉన్న దేవత్వాన్ని అర్థం చేసుకుంటాడు. ఈ పాట విజువల్స్ లో రణబీర్ కపూర్ అగ్నిశక్తిని తనలో ఉంచుకున్నట్లు చూపిస్తారు.
నా గుండెల్లో ఈ దీపాలే
నీ వైపే చూడగా
నిన్నే చూసి… నిన్నే చేరి
పెను జ్వాలై మారగా
తనువున జ్వాల పెరిగిన వేళా
కాలిపోయానిలా
ఈ మంటల్లో సరికొత్తగా
జన్మించా ప్రేమగా
ఓం దేవా దేవా..!
ఓం దేవా దేవా నమః
నమో నమః
ఓం దేవా దేవా..!
ఓం దేవా దేవా నమః
నమో నమహొమ్
బ్రతికించినావే నా బ్రతుకు
నీ చెలిగా కలగా
ఓం దేవా దేవా..!
ఓం దేవా దేవా నమః
నమహొ నమః
నమహొ నమః
ఉంది ఉందంట నీ ప్రేమ అనాదిగా
వచ్చి మన వెంట ఉందంటా ఉగాదిగా
ఆ తీపి గాధే అయ్యిందే పునాదిగా
ఈ దారిలో… ఈ దారిలో
దారం నేను నువ్వింక బంధానివి
యాగాన్ని నేను… నీ నవ్వే మంత్రాక్షరి
పొందాలి జంటై… సరాగాల సారమే
ఈ లీలలో… ఈ లీలలో
అణువులలోనే అణువుగా దాగే
ప్రాణ భాగానివే
ఈ మంటల్లో సరికొత్తగా
జన్మించా ప్రేమగా
ఓం దేవా దేవా..!
ఓం దేవా దేవా నమః
నమో నమః
ఓం దేవా దేవా..!
ఓం దేవా దేవా నమః
నమో నమః నమహొ
నమహొ నమహొ
నమహొ నమహొ.. ..
పాట: దేవా దేవా
చిత్రం: బ్రహ్మాస్త్రం పార్ట్ 1: శివ
గాయకులూ: శ్రీరామ్ చంద్ర, జోనిటా గాంధీ, అర్జిత్ సింగ్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: ప్రీతం
దర్శకుడు: అయన్ ముఖర్జీ
నటి నటులు: అలియా భట్, రన్బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు
Kumkumala Nuvve Song Lyrics Brahmastra
Allari Motha Song Lyrics Brahmasthra
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.