కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ
నిజాము తెలిసిన కళని చెప్పిన మనసు నమ్మదేల
ఎదుటే ఎప్పుడు తిరిగే వేలుగా
ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్లు నేనున్నదీ నడిరేయి నిద్రలోనా
అయితే నాకీనాడే తోలి పొద్దు జాడ తెలిసిందా కొత్తగా
కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ
నిజాము తెలిసిన కళని చెప్పిన మనసు నమ్మదేల
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మాది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం వుంది
దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ
నిజాము తెలిసిన కళని చెప్పిన మనసు నమ్మదేల
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచేయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మరి
కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ
నిజాము తెలిసిన కళని చెప్పిన మనసు నమ్మదేల
ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా
ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్లు నేనున్నదీ నడిరేయి నిదురలోనా
అయితే నాకీనాడే తోలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా
_______________________
సాంగ్ : కన్నులు తెరిచినా కన్నులు మూసినా (Kanulu Terichina Kanulu Moosina)
చిత్రం: ఆనందం (Anandam)
నటీనటులు: ఆకాష్ (Aakash), రేఖ (Rekha)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: మల్లిఖార్జున్ (Mallikharjun), సుమంగళి (Sumangali)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.