Home » ఏమై పోయావే – పడి పడి లేచె మనసు

ఏమై పోయావే – పడి పడి లేచె మనసు

by Rahila SK
0 comment

పాట: ఏమై పోయావే
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకులు: సిద్ శ్రీరామ్
చిత్రం: పడి పడి లేచె మనసు (2018)
తారాగణం: సాయి పల్లవి, శర్వానంద్
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్


ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

నీతో ప్రతి పేజీ నింపేసానే
తెరవక ముందే పుస్తకమే విసిరేసావే
నాలో ప్రవహించే ఊపిరివే
ఆవిరి చేసి ఆయువునే తీసేసావే

నిను వీడి పోనంది
నా ప్రాణమే
నా ఊపిరినే నిలిపేది
నీ ధ్యానమే

సగమే నే మిగిలున్నా
శాసనమిది చెబుతున్నా
పోనే లేనే నిన్నొదిలే

ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

ఎటు చూడు నువ్వే
ఎటు వెళ్లనే నే
లేని చోటే
నీ హృదయమే

నువు లేని కల కూడా రానే రాదే
కల లాగ నువు మారకే
మరణాన్ని ఆపేటి వరమే నీవే
విరహాల విషమీయకే

ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment