Home » సాహసం శ్వాసగా – ఒక్కడు

సాహసం శ్వాసగా – ఒక్కడు

by Firdous SK
0 comment

పాట: సాహసం శ్వాసగా
సినిమా: ఒక్కడు
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: మల్లిఖార్జున్


సాహసం శ్వాసగా
సాగిపో సోదరా
సాగరం ఈదటం
తేలికేం కాదురా

ఏ కోవెలో చేరాలని
కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై
దొరికింది ఈ పల్లకి

ఈ ఒక్కడు నీ సైన్యమై
తోడుంటే చాలు

సాహసం శ్వాసగా
సాగిపో సోదరా
సాగరం ఈదటం
తేలికేం కాదురా

కాలానికే తెలియాలిగా
ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా
రానున్న గెలుపెవరిదో

ఈ ఒక్కడు నీ సైన్యమై
తోడుంటే చాలు

సాహసం శ్వాసగా
సాగిపో సోదరా
సాగరం ఈదటం
తేలికేం కాదురా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment