Home » డుం డుం నటరాజు సాంగ్ లిరిక్స్ – మురారి

డుం డుం నటరాజు సాంగ్ లిరిక్స్ – మురారి

by Vinod G
0 comment

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
గుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగా
నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరిడుగా
బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట
ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట
నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ

అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా
బ్రహ్మన్న పుత్ర హేయ్ బాలచంద్ర చెయ్యెత్తి జైకొట్టరా
పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా
వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా
అరె వెలిగించర లోనిదీపం అహ తొలగించరా బుద్ధి లోపం
ఓహో ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మ
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా

చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా
చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా
నీవు నీకు తెలిసేల నిన్ను నీవు గెలిచేల
మార్చాలిరా మన గీత
చిగురంత వలపో చిలకమ్మ పిలుపో
గుణపాఠం వుండాలిరా
పెదవుల్లో చలి ఈల పెనవేస్తె చెలి గోల
చెలగాటం ఆడాలిరా
అహ మారిందిరా పాతకాలం నిండు మనసొక్కటే నీకు మార్గం

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట
ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట
నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హా హా హా
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ


చిత్రం: మురారి
గాయకులు: శంకర్ మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణ వంశీ
తారాగణం: మహేష్ బాబు, సోనాలి బింద్రే తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment