Home » అందానికే అద్దానివే సాంగ్ లిరిక్స్ – మురారి

అందానికే అద్దానివే సాంగ్ లిరిక్స్ – మురారి

by Vinod G
0 comments
andhanikey addanive song lyrics murari

గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడి
గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడి
పొద్దు పొడిచె పొద్దు పొడిచె ఓ లచ్చ గుమ్మాడి
పుత్తడి వెలుగులు ఉహు హు హు ఓ లచ్చ..

అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకె ఉందీ
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకె ఉందీ
ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే

నువ్వు పిలిచేందుకే.. నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే.. నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే.. నాకు పొగరున్నదీ
ఒక్కట్టయ్యేందుకే.. ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నదీ

మిల మిల మిల మిల ముక్కెర నేనై వస్త
నీ కల కల కల కల మోముని చూస్తు ఉంట
గల గల గల గల మువ్వని నేనై వస్త
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంట
కస్తూరిలా మారి నీ నుదుటనె చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదుటనె చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకె నా గుండె చాటుల్లొ చోటున్నది
నీ వాడిగా ఉండేందుకె ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకె ఉందీ
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకె ఉందీ


చిత్రం: మురారి
గాయకులు: శంకర్ మహదేవన్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణ వంశీ
తారాగణం: మహేష్ బాబు, సోనాలి బింద్రే తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.