Home » ఇటు రావే నా గాజు బొమ్మ-హాయ్ నాన్న 

ఇటు రావే నా గాజు బొమ్మ-హాయ్ నాన్న 

by Farzana Shaik
0 comment

ఇటు రావే నా గాజు బొమ్మ
నేనే నాన్న అమ్మ
ఎద నీకు ఉయ్యాల కొమ్మ
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా…
వాలిపో .. యి గుండెపైనే ..
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా …

చిన్ని చిన్ని పాదాలని
నేలై నే మోయనా
చిందే క్షణంలో
నువు కిందపడిన
ఉంటావు నా మీదలా..
నీ చెంతే రెండు చెవులుంచి
భయలెల్లనా

ఏ మాట నీ నోట మొగించినా
వెనువెంటే వింటానే
రానా నిమిషం లోనా
నే నన్నే వదిలేసైనా

తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి
కాపై నేనుండనా ..
ఉచ్వాస నైన నిశ్వాస నైన
మేలెంచి పంపించనా
ఏ కాంతులైన అవి నన్ను దాటాకనే
ఆ రోజు చేరాలి నీ చూపునే
నీ రెప్పై ఉంటానే ..

పాప కంటి పాప
నా పాప కంటి పాప …

ఇటు రావే నా గాజు బొమ్మ
నేనే నాన్న అమ్మ
ఎద నీకు ఉయ్యాల కొమ్మ
నిన్ను ఊపే చెయ్యే ప్రేమ …
వాలిపో .. యి గుండెపైనే ..
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా …

మరిన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment