చిత్రం(Movie) : పందెం కోడి

సాహిత్యం(Lyrics): వెన్నెలకంటి

సంగీతం(Music): యువన్ శంకర్ రాజా

గాయకులు(Singers): రఘు కుంచె, నాగ సాహితీ, నాగ స్వర్ణ

తారాగణం(Cast): విశాల్, మీరా జాస్మిన్

సంవత్సరం(Year): 2006

voni vesina deepawali song lyrics

ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి

చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి

ఆటే దాగుడుమూత తన పాటే కోయిల కూత

మనసే మల్లెల పూత ఆ పరువం దోచుకుపోతా

రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే

ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే

ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి

అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి

వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను పుచ్చుకుపోరా కమ్మగా

రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే

ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే

అందమిది అందమిది వచ్చే పందెంకోడిలా

పొంగినది పొంగినది పచ్చి పాల ఈడులా

సందెపొద్దు వేళలోన సన్నజాజి పువ్వులా

అందమంత ఆరబోసి నీకు హారతివ్వనా

వచ్చే వచ్చే వలపే నా మనసులోని పులుపే

ఆశ పడ్డ తలపే నా ఎదలో మోజు తెలిపే

ఇంతకుమించి ఇంతకుమించి ఏదో ఏదో ఉందిలే

కలికి కులుకు తళుకుబెళుకులొలుకుతున్నాది

ఆ చిలక బుగ్గ మొలక మొగ్గ విచ్చుకున్నాది

కన్నె ఇది కన్నె ఇది కన్ను కొట్టమన్నది

వన్నె ఇది వన్నె ఇది వెన్ను తట్టమన్నది

పరికిణి కట్టుకు వచ్చెను పరువాల జాబిల్లి

పదునైన సోకుగని ఎదకేదో ఆకలి

కనులు పాడే జోల ఇది దేవలోక బాల

కలలు కనే వేళ ఇది కలువ పూల మాల

ఏటవాలు చూపులేసి లాగింది నా గుండెని

కంది చేను చాటుకొస్తే కలుసుకుంటాలే

ఈ అందగాడి ఆశలన్ని తెలుసుకుంటాలే…

ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి

చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి

ఆటే దాగుడుమూత తన పాటే కోయిల కూత

మనసే మల్లెల పూత ఆ పరువం దోచుకుపోతా

ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి

అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి

వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను పుచ్చుకుపోరా కమ్మగా

రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే

ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే

రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే

ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే…….

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published