నీవే

తొలి ప్రణయము నీవే

తెలి మనసున నీవే

ప్రేమ ఝల్లువే

నీవే నీవే

కలలు మొదలు నీవల్లే

మనసు కదలి అలలు నీవల్లే

కనులు తడుపు నీవే

కలత చెరుపు నీవే

చివరి మలుపు నీవే

నీవే

ఎటు కదలిన నీవే

నను వదలిన నీవే

ఎదో మాయవే ఆ

ప్రేమే

మది వెతికిన నీడే

మనసడిగిన తోడే

నా జీవమే ఆ ఆ ఆ

నిలువనీదు క్షణమైనా

వదలనన్న నీ ధ్యాస

కలహమైన సుఖమల్లే

మారుతున్న సంబరం

ఒకరికొకరు ఎదురైతే

నిమిషమైన యుగమేగా

ఒక్కోసారి కనుమరుగై

ఆపకింక ఊపిరి

నీవే

గడిచిన కథ నీవే

నడిపిన విధి నీవే 

నా ప్రాణమే ఆ

పాదం

వెతికిన ప్రతి తీరం

తెలిపిన శశి దీపం

నీ స్నేహమే

నీ జతే విడిచే

ఊహనే తాళనులే

వేరొక జగమే

నేనిక ఎరుగనులే

గుండెలోని లయ నీవే

నాట్యమాడు శ్రుతి నేనె

నువ్వు నేను మనమైతే

అదో కావ్యమే

నీవే

నను గెలిచిన సైన్యం

నను వెతికిన గమ్యం

నీవే నా వరం ఆ

ప్రేమే

తొలి కదలికలోనే

మనసులు ముడి వేసే

ఇదో సాగరం

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published