Home » పర్యావరణ కాలుష్యం – వివరణ

పర్యావరణ కాలుష్యం – వివరణ

by Nithishma Vulli
0 comment

సహజ పర్యావరణానికి ఎలాంటి హాని జరిగినా దానిని “పర్యావరణ కాలుష్యం” అంటారు. పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణం మనుషులు, ఎందుకంటె మానవుల కనీస అవసరాలకే కాకుండా, సుఖ సౌఖ్యాలకు సహజ వనరులను విచక్షణా రహితంగా దుర్వినియోగం చేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, కాలుష్యానికి గురవుతున్నది. నేటి సమాజంలో పర్యావరణ కాలుష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. రాబోతున్న రోజుల్లో పర్యావరణ కాలుష్యం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది.  

environmental pollution

 వివిధరకాల పర్యావరణ కాలుష్యాలు:

పర్యావరణం లో వివిధరకాలైన  కాలుష్యాలు వున్నాయి కానీ, అందులో ముఖ్యమైన కాలుష్యాలను గురించి తెలుసుకుందాం:

1. వాయు కాలుష్యం:

కాలుష్య కారకాలు వాయువులో కలసి, మానవులకు మరియు పర్యావరణమునకు హాని కలిగించు ఏదైనా పదార్ధమును వాయు కాలుష్య కారకం అంటారు. కాలుష్య కారకాలు, ఘన, ద్రవ లేదా వాయు రూపములో ఉండవచ్చును.చాలా చోట్ల ఫ్యాక్టరీలు మరియు కార్ల నుండి వచ్చే పొగ సహజంగా వచ్చే పొగమంచుతో కలిసి స్మోగ్‌గా ఏర్పడుతుంది. శతాబ్దాలుగా, లండన్, ఇంగ్లండ్, పొగమంచు ప్రమాదానికి గురైంది, వాయు కాలుష్యం యొక్క సంచిత ప్రభావం మానవులకు మరియు పర్యావరణానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.

2. నీటి కాలుష్యం : 

నీటి కాలుష్యం, వ్యర్ధ పదార్ధాలని , కలుషితాలని నది మురుగు వ్యవస్థల యొక్క ఉపరితలంలో పారబొయ్యటం ద్వారా, భూగర్భ జలాలలో నాచు పేరుకుపోవటం వలన, ద్రవాలు కారిపోవటం వలన, వ్యర్ధ నీటిని వదిలివెయ్యటం వలన, ఖనిజాలు పోగవ్వటం , వ్యర్ధాలు పేరుకుపోవటం వలన జరుగుతుంది.నీటి కాలుష్యం జరుగుతుంది. 

3. భూమి కాలుష్యం: 

భూమి కాలుష్యం ముఖ్యంగా ప్లాస్టిక్  వల్ల ఏర్పడుతుంది. ప్లాస్టిక్ భూమి లో సామాన్యంగా కలిసిపోదు, భూమిలో కలవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా అనేకరకాలైన పురుగుల మందులు వాడడం వల్ల  భూమి కాలుష్యం ఎక్కువ జరుగుతుంది. 

4. శబ్ద కాలుష్యం:

శబ్ద కాలుష్యం అనేది ఈరోజుల్లో ఎక్కువగా ఉంటుంది. అధిక గందరగోళం సృష్టిస్తుంది . ప్రపంచవ్యాప్తంగా శబ్ద కాలుష్యం ప్రధానంగా యంత్రాలు మరియు రవాణా ఫ్రేమ్‌వర్క్‌లు, ఇంజిన్ వాహనాలు, ఎయిర్ షిప్ మరియు రైళ్ల ద్వారా జరుగుతుంది.

పర్యావరణ కాలుష్యం వలన కలిగే నష్టాలు:

  1. వాతావరణ మార్పులు. 
  2. గ్లోబల్ వార్మింగ్.  
  3. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్.  
  4. భూకంపాలు మరియు వరదలు.  
  5. అనేకరకాలైన వ్యాధులు.  
  6. ఓజోన్ క్షీణత. 
  7. జన్యు పరివర్తన. 
  8. ఆమ్ల వర్షాలు.  

కాలుష్యాన్ని నివారించటానికి తీసుకోవాల్సిన చర్యలు:

  1. చెట్లను పెంచడం. 
  2. ప్లాస్టిక్ వాడకం తగించడం. 
  3. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం.  
  4. రసాయనాల వాడుక తగించడం.  
  5.  జీవశైధిల్య ప్రక్రియను వాడండి.  

ముగింపు: 

పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత , పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకోడం మానవులుగా మన బాధ్యత. పర్యావరణ కాలుష్యాన్ని నివారించి ఆనందంగా జీవిదాం, ఆరోగ్యంగా జీవిద్దాం. మరింత సమాచారం కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment