Home » స్టోరీ లైన్ – 1970లో ఒక కథ

స్టోరీ లైన్ – 1970లో ఒక కథ

by Vinod G
0 comment

అందమైన చారిత్రక ప్రదేశాలు, రాజుల కాలం నాటి దేవాలయాలు, ఇంకా ప్రకృతీ ఇంత అందమైందా అనే విధంగా భారతదేశం లో వుండే ఒక అరుదైన ప్రదేశము. ఈ ప్రాంతానికి ఎక్కువుగా విదేశీ సందర్శకులు వస్తుంటారు. ఈ ప్రాంతానికి దగ్గరలోనే పక్కన చిన్న పల్లెటూరు కలదు. ఈ పల్లెటూరు వారు ఎక్కువుగా సందర్శకులకు గైడ్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు.

ఈ పల్లెటూరు లో రాజు అనే యువకుడు ఉండేవాడు. ఇతను దగ్గర్లో వుండే టౌన్ లో డిగ్రీ చదువుతుంటాడు. ఈ ఊరి లో డిగ్రీ చదివే ఏకైక వ్యక్తి ఇతను ఒక్కడే. ఇతడి తోటి స్నేహితులు ఇంటర్ లేదా ssc చదివి వచ్చి రాని ఇంగ్లిష్ తో గైడ్స్ గా పనిచేస్తుంటారు. రాజు కి గైడ్ గా పనిచేయడం ఇష్టం ఉండదు. దీనికి కారణం అతడి తండ్రి మరణం. రాజు తండ్రి ఒక గైడ్ గా పనిచేస్తు, ఆ ప్రదేశానికి మంచి గుర్తింపు తీసుకు రావాలని నిరంతరం కష్టపడుతుంటారు. అయితే ఇతడితో పాటు వుండే వేరే గైడ్స్ సందర్శనకు వచ్చిన ఒక కుటుంబాన్ని దారి దోపిడీ చేసి ఆ నింద రాజు తండ్రి మీద మోపడం జరుగుతుంది. దీని వలన అతడు ఒక దొంగ గా ముద్రింపబడుతాడు. దీని వలన అతడి ఆత్మాభిమానం గాయపడి ఉరి వేసుకుని బలవన్మమరణానికి పాల్పడుతాడు. రాజు చిన్న తనం లో జరిగిన ఈ సంఘటన రాజు జీవితాన్ని ఎక్కువుగా ప్రభావితం చేసింది. తండ్రి మరణంతో తల్లి ఎన్నో కష్టాలుపడి రాజును చదివిస్తుంది. రాజు బాగా చదివి కలెక్టర్ అయి ఆ ఊరికి దేశంలో మంచి టూరిస్ట్ ప్లేస్ గా గుర్తింపు తీసుకు రావాలని నిర్ణయంచుకుంటాడు. రాజుకి రహీం అనే మంచి స్నేహితుడు ఉంటాడు. ఇతడు రాజుకి చాల సహాయంగా ఉంటాడు.

love

రాజు డిగ్రీ పూర్తి చేసి సెలవులకు ఇంటికి బస్సు లో వస్తుంటాడు. ఈ సమయం లో అతడు కళ్ళు మూసుకుని డిగ్రీ చదివిన రోజులు, ఇంకా అతడి ప్రేయసి రాణి తో గడిపిన రోజులు అన్ని గుర్తుకు తెచ్చుకొని మనసులో ఆనంద పడుతుంటాడు. రాజు , రాణి ఒకరికి ఒకరు అనే విధంగా వుంటారు. రాణి చాల అందమైన అమ్మాయి, వీరి జంట చాల అందం గా ఉంటుంది. వీరు చదువుపూర్తి చేసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా వేరే వ్యక్తి వచ్చి “పక్కకు జరగండి నేను కూర్చుంటాను” అని అంటాడు. అప్పుడు రాజు అతడికి సీటు ఇచ్చి పక్కకు జరిగి, అతడి దగ్గర వున్నా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని తీసుకొంటాడు. ఆ న్యూస్ పేపర్ ని చదువుతూ ఉండగా అతడు ఒక వార్తను చూసి అసహనానికి గురవుతాడు. ఆ వార్త ఏమిటంటే భారతదేశ సందర్శనకు వచ్చిన విదేశీ యాత్రికులు రకరకాల దోపిడులకు గురవుతున్నారు, దీని వల్ల భారత దేశానికీ చెడ్డ పేరు వస్తుందని రాసి ఉంటుంది. ఈ వార్తను చూసి అసహనానికి గురవుతాడు. ఇది అంతా కూడా వెనక వైపు వున్నా విదేశీ మహిళ గమనిస్తుంది, ఆమెతో పాటు మరొక విదేశీ యువకుడు కూడా ఉంటాడు. ఆ విదేశీ మహిళ రాజుతో మాట్లాడుతుంది. ఆ విదేశీ వ్యక్తులు కూడా రాజు నివసించే పల్లెటూరు దగ్గర ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు చూడడానికి వస్తున్నారని రాజుకి అర్ధమవుతుంది. ఆ విదేశీ మహిళా చాల అందంగా, పట్టుకుంటే మరక పడే బొమ్మలా అందంగా ఉంటుంది. రాజు కూడా ఆ మహిళతో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ పల్లెటూరి అందాలు వర్ణిస్తూ ఉంటాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా వారు దిగవలసిన స్టాప్ వస్తుంది. రాజుతోపటు వారు ఆ విదేశీ యాత్రికులు కూడా దిగుతారు. ఆ విదేశీ యాత్రికులు ఆ ఊరిలో ఉన్నటువంటి చిన్న ట్రావెల్ గైడ్ ఆఫీస్ కి వెళతారు, రాజు కూడా అతడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన రహీమ్ తో పాటు ఇంటికి బయలు దేరుతారు.

మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇద్దరు విదేశీ యాత్రికులు ఇద్దరు గైడ్ లతో అందమైన చారిత్రక ప్రదేశాలు చూడడానికి వెళ్తూ రాజుకి ఎదురు వస్తారు. అప్పుడు ఆ విదేశీ మహిళా రాజుతో మాట్లాడుతూ ఇలా అంటుంది “ రాజు నువ్వు గైడ్ గా రావలసిన అవసరం లేదు, కానీ మేము ఫిలిం షూటింగ్ చేయడానికి వెళ్తున్నాము, నేను ఫిలిం యాక్టర్ ని అని, ఇతను ఫిలిం డైరెక్టర్ అని పక్కన వున్న విదేశీ యువకుడిని పరిచయం చేస్తుంది. అలాగే చిన్న క్యారెక్టర్ రోల్ వుంది చేస్తావా” అని అడుగుతుంది. అప్పుడు రాజు నేను చేయలేను అని ఆ విదేశీ మహిళకి నచ్చచెప్పి పంపించేస్తాడు. వాళ్ళు వెళ్లిన తరువాత రాజు నడుస్తూ ఇలా ఆలోచిస్తాడు “ ప్రస్తుతానికి మనం ఇవాళ ఖాళీగానే వున్నాం, అంతేకాకుండా ఆ విదేశీ మహిళ రిక్వెస్ట్ చేసింది, దాంతో పాటు వెళ్లిన ఇద్దరు గైడ్స్ ఇంతక మునుపు మంచివారు కాదు” అని ఆలోచిస్తాడు. చివరికి సరే వెళ్దాం అని వాళ్ళు వెళ్లిన వైపు రాజు కూడా నడక మొదలు పెడతాడు. ఇలా నడుస్తూ కొద్దిదూరం ముందుకు వెళ్లేసరికి అతనికి గన్ ఫైర్ శబ్దం వినిపిస్తుంది. అది విన్న రాజు కంగారుగా శబ్దం విన్న వైపుగా పరిగెడతాడు. ఇలా అక్కడికి చేరుకోవడాని కొద్దిదూరంలో రాజు చూస్తూ ఉండగా ఆ ఇద్దరు విదేశీ యువతీయువకులు గొడవపడుతూ చివరికి రాజు చూస్తూ ఉండగానే ఆ యువతిని ఆ యువకుడు గన్ తో నుదిటి మీద ఫైర్ చేసి చంపేస్తాడు. అప్పుడు రాజు ఆ విదేశీ యువకుడితో పోట్లాటకి దిగుతాడు. కానీ ఆ విదేశీ యువకునికి కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యలు తెలియడం వలన రాజు అతనితో పోటీ పడి గెలవలేకపోతాడు. పక్కనే ఒక చెట్టుకి కట్టేసి వున్నా ఒక గైడ్ గట్టిగా అరుస్తూ “రాజు నువ్వు పారిపో లేదంటే నిన్ను చంపేస్తాడు త్వరగా పారిపో, పోలీస్ స్టేషన్ కి వెల్లు” అని గట్టిగా అరుస్తాడు. అది గమనించిన రాజు అతడి వైపు చూడగానే, ఆ కట్టేసి వున్నా గైడ్ పక్కనే మరొక గైడ్ చనిపోయి శవం ఉంటుంది. ఇది గమనించిన రాజు అక్కడి నుండి తప్పించుకోవడానికి పరుగు తీస్తాడు. రాజుని పట్టుకోవడానికి అతడి వెంట విదేశీ యువకుడు పరిగెడతాడు. ఇలా కొద్దీ దూరం పరిగెత్తిన తరువాత విదేశీ యువకుని చేతిలో వున్న గన్ తో రాజు వైపు ఫైర్ చేస్తాడు. ఆ బులెట్ రాజు మోకాలి కింద భాగంలో తగిలి పడిపోతాడు. అయినా రాజు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ యువకుడు రాజుని చేరుకొని అతడి కాలు పట్టుకొని లాక్కెళ్లి పోతాడు.

రాజు అక్కడికి వెళ్ళడానికి ముందు జరిగిన కథ

రాజు యాక్టింగ్ ఇష్టం లేదు అని చెప్పిన తరువాత విదేశీ యువతియువకులు ఇద్దరు, గైడ్స్ ఇద్దరు అక్కడి నుండి వచ్చేస్తారు. ఇలా వచ్చిన వారు ఫిలిం షూటింగ్ కి సరిపోయే మంచి చోటుకు చేరుకొంటారు. ఇలా అక్కడ లొకేషన్ సెట్ అయిన తరువాత ఆ విదేశీ డైరెక్టర్ సీన్ ను మిగతా ముగ్గురికి ఇలా వివరిస్తాడు “ ఇద్దరు గైడ్ లు ఆ విదేశీ మహిళను దోచుకోవాలని వివరిస్తాడు, తరువాత ఒక గైడ్ ఒప్పుకోక పోతే అతడిని చెట్టుకి కట్టి వేసి మరొక గైడ్ ఆ మహిళను రేప్ చేయాలనీ” సీన్ వివరిస్తాడు. దాని ప్రకారం వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు, డైరెక్టర్ కెమెరాతో సీన్ షూటింగ్ చేస్తుంటాడు. ఇలా సీన్ తీస్తూ ఉండగా ఒక గైడ్ ని చెట్టుకి కట్టివేసిన తరువాత రేప్ సీన్ చేస్తూ ఉండగా ఆ డైరెక్టర్ ఆ కెమెరా ని స్టాండ్ కి తగిలించి రేపే సీన్ చేస్తున్నా ఆ గైడ్ మరియు మహిళను సమీపించి, నిజంగానే ఆ మహిళను రేప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది గమనించిన ఆ గైడ్ అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఈ పెనుగులాటలో ఆ విదేశీ యువకుడు గైడ్ ని గన్ తో షూట్ చేసి చంపేస్తాడు. తరువాత ఆ మహిళను రేప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ పెనుగులాటలో ఆ మహిళను కూడా యువకుడు గన్ తో షూట్ చేసి చంపేస్తాడు. ఇది రాజు పరిగెత్తుకుంటూ వస్తూ చూస్తాడు.

రాజుని ఆ విదేశీ యువకుడు లాక్కెళ్లి ఒక పురాతన కోటలో బందించి చిత్రహింసలకు గురి చేస్తాడు. మిగిలి ఉన్న మరొక గైడ్ ని ఆ విదేశీ యువకుడు నువ్వు నేను చెప్పింది చేయకపోతే ఫిలిం షూటింగ్ లో తీసిన రేప్ సీన్ ని పోలీసులకు చూపించి నింద నీ మీద వేస్తాను. అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అప్పుడు ఆ గైడ్ నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ గైడ్ మరియి విదేశీ యువకుడు ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాతో పాటు వచ్చిన విదేశీ మహిళ కనపడుటలేదు అని కంప్లైన్ట్ ఇస్తారు. రాజుమీద అనుమానం వున్నట్లుగా ఇద్దరు చెప్తారు. పోలీసులు రాజు ని వెదకడం ప్రారంభిస్తారు. మూడు, నాలుగు రోజులైనా కనపడక పోయేసరికి రాజు ని అందరు అనుమానించడం ప్రారంభిస్తారు. ఆ ఉరి ప్రజలు కూడా వాళ్ళ నాన కూడా మంచివాడు కాదని పోలీసులకు వాంగ్మూలం ఇస్తారు. ఇలా కొద్దీ రోజులు జరుగుతూ ఉండగా, ఈ విషయం రాజు ప్రేయసి అయిన రాణి కి తెలుస్తుంది. అప్పుడు రాణి రాజు వాళ్ళ ఊరికి వచ్చి రాజు వాళ్ళ అమ్మని కలిసి ఆమెకు దైర్యం చెప్పి, రహీం సహాయంతో రాజు గురించి, ఇంకా అసలు ఎం జరిగింది అని ఆరాతీస్తుంటారు.

ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ విదేశీ యువకుడికి రహీమ్, రాణి కనపడతారు. అప్పుడు రాణి మీద అతడికి కన్ను పడుతుంది. ఎలాగైనా అనుభవించాలి అనుకుంటాడు. మరుసటి రోజు రాణి అసలు ఎం జరింగింది అని తెలుసుకోవడానికి ఆ విదేశీ యువకుడిని కలవడానికి వెళుతుంది. ఆ విదేశీ యువకుడు రాణికి పాతుపడిన రాజు కోట దగ్గర కలుద్దాం అని చెప్పి రమ్మంటాడు. అతడిని కలవడం ఇష్టం లేని రహీం రాణికి తెలియకుండా వెంబడిస్తాడు. రాణి అక్కడికి వెళ్లిన తరువాత మాటలు సంభాషణ లో ఇద్దరు వాగ్వాదం చేసుకుంటారు. ఆ యువకుడు కోపంతో రాణిని కొట్టి, లాక్కెళ్లి మానభంగం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ లోపు గైడ్ మరియు రహీం ఇద్దరు రాజు ఎక్కడ వున్నాడో కనుక్కొని అతడిని విడిపించుకొని రాణి దగ్గరకు వస్తారు. రాజు మరియు రహీం ఇద్దరు విదేశీ యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతలో గైడ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి రాజుని మరియు విదేశీ యువకుడిని అరెస్ట్ చేస్తారు. అయితే విదేశీ మహిళ రేప్ సమయం లో మరొక స్టాండ్ కెమెరా ఆన్ లో ఉండడం వలన మొత్తం కూడా వీడియో రూపం లో రికార్డు అవుతుంది. ఈ వీడియో మరియు గైడ్ సాక్షం ద్వారా రాజు నిర్దోషిగా విడుదలవుతాడు. చివరకు ఆ విదేశీ యువకుడు దోషిగా నిరూపించబడి కఠిన కారాగార శిక్షపడుతుంది. రాజుని ఆఊరి ప్రజలు అభినందిస్తారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment