Home » గోవా: ఇండియా మినీ బాంగ్కొక

గోవా: ఇండియా మినీ బాంగ్కొక

by Nikitha Kavali
0 comment

గోవా ని మనం ఇండియన్ బెంగకొక అని కూడా పిలుస్తాం. గోవా దేశం లోనే టూరిజం కి ఎంతో పేరు పొందిన రాష్ట్రం అందమైన బీచ్ లు, పురాతన కట్టడాలు, ఇంకా ఎన్నో సుందరమైన ప్రకృతి తో ఎంతో మంది ట్రావెలర్స్ ను ఆకట్టుకుంటుంది.

భారత దేశానికి దక్షిణాన అరేబియా సముద్ర తీరానికి దగ్గర్లో ఉంటుంది. గోవా కి తూర్పున కర్ణాటక, ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రాల తో సరిహద్దులు పంచుకుంటుంది. గోవా జనాభా పరంగా చూసుకుంటే దేశం లో  నాలుగవ స్థానం లో ఉంటుంది.

గోవా వైశాల్యం లో చిన్నది అయినా ఆ రాష్ట్ర సంస్కృతులలో ఎంతో వైవిధ్యం ఉన్న రాష్ట్రం. మన పురాణాల లో గోవా రాష్ట్రాన్ని గోవపురి, గోపరాష్ట్రం, గోమంచాల, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, వంటి పేర్లతో పిలిచేవారు.

గోవా ప్రముఖ ప్రదేశాలు 

ఇక్కడ మీరు చూడటానికి చేయడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి అక్కడ సంస్కృతి మిమ్మల్ని ఎంత గానో ఆకట్టుకుంది. గోవా భిన్న సంస్కృతికె కాదు ఆ రాష్ట్రం ఎన్నో వినోదాలకు చిహ్నం. ఒకసారి ఈ రాష్ట్రాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండాలి అని అనుకుంటారు.

గోవా సముద్ర తీరా ప్రదేశాలు :

గోవా అనగానే మనకి మొదట గుర్తు వచ్చేది బీచ్ లు. గోవా బీచ్ లకి పెట్టినది పేరు. ఈ రాష్ట్రం అరేబియా సముద్ర తీరం లో ఉండటం తో పడమర వైవు న మొత్తం సముద్ర తీరమే ఉంటుంది.  సముద్ర అందాలతో  ఎంతో మంది ట్రావెలర్స్ ను ఆకట్టుకుంటుంది. ఏ టైం లో మీరు ఆ బీచ్ లను సందర్శించిన ఎప్పుడు జనాభాలతో చాల సందడిగ ఉంటుంది. ఇంకా రాత్రి పూట అయితే అక్కడ పబ్ లలో లైటింగ్స్ తో ఎంతో ఎనర్జిటిక్ గ ఉంటుంది ఇంకా అక్కడ ఆడటానికి కేసినో గేమ్స్ కూడా చాల ఉంటాయి. గోవా లో మీరు బీచ్ లను సందర్శించే పని అయితే అక్కడ సుమారు ముప్పై అయిదు  పైన బీచ్లు ఉన్నాయి వాటిలో కాలాంగుటె బీచ్, బాగా బీచ్, డీఎస్ బీచ్, సిన్క్యూరీమ్ బీచ్, కండోలిం బీచ్, మండ్రేమ్ బీచ్, చాపోరా బీచ్, కేగడాలే బీచ్, పాలొలెం బీచ్ చాల ప్రాముక్యత పొందిన బీచ్లు.

గోవా చారిత్రక కట్టడాలు:

ఈ రాష్ట్రం బీచ్ లకే కాదు ఎన్నో చారిత్రక కట్టడాలకు కూడా పేరుపొందిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని పోర్చుగీస్ కూడా పరిపాలించారు కాబట్టి ఇక్కడ కట్టడలలో భారతీయ మరియు పోర్చుగీస్ యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క కట్టడానికి ఒక చరిత్ర ఉంటుంది మీరు ఈ చారిత్రక కట్టడాలను సందర్శించినప్పుడు అవి మిమ్మల్ని ఆ కాలం కి తీసుకెళ్ళిపోతాయి. ఆగాడా ఫోర్ట్, గోవా స్టేట్ మ్యూసియం, అగస్టీన్ టవర్, ఆజాద్ మైదాన్, బాసిలిక అఫ్ బొమ్ జీసస్ చర్చి, ఇండియన్ నావెల్ ఏవియేషన్ మ్యూసియం, బిగ్ ఫుట్ గోవా, కెజెటం చర్చి, ఇలా ఇంకా ఎన్నో చారిత్రక కట్టడాలు మనల్ని ఎంత గానో ఆకట్టుకుంటాయి.

గోవా పార్క్స్:

ఇక్కడఎంతో సుందరమైన ప్రకృతి కి చిహ్నం. ఇక్కడ టూరిస్ట్ లను అట్ట్రాక్ట్ చేసే విధంగా ఎన్నో పార్కులు, జంతు ప్రదర్శన శాలలు ఉన్నాయి. మీరు ఒక ప్రకృతిని ఆస్వాదించి ఆనందించే మనిషి అయితే మీకు ఇక్కడ ఉన్న వాటర్ పార్క్స్, అమ్యూసెమెంట్ పార్క్స్, ఇంకా ప్రకృతి సుందరణీయమైన ప్రదేశాలు ఎంతో తృప్తిని ఇస్తాయి. మీ స్నేహితుల తో, కుటుంభ సభ్యులతో ఇక్కడ ఉన్న పార్కులను సందర్శించి ఎన్నో మధురానుభూతులను ఏర్పరచుకోవచ్చు. భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ సాంక్చర్య్, బోండ్ల వైల్డ్ లైఫ్ సాంక్చర్య్, కోటిగావు వైల్డ్ లైఫ్ సాంక్చర్య్, స్పేళ్శడౌన్ వాటర్ పార్క్, ఫ్రోగ్య్ ల్యాండ్, ఇలా ఇంకా చాల ప్రదేశాలు ఉన్నాయి.

గోవా ఫెస్టివల్స్:

ఈ రాష్ట్రం భిన్నమైన సంస్కృతి కి పేరు. ప్రతి రోజు ఏదో ఒక ఫెస్టివల్ తో ఇక్కడ ప్రతి రోజు పండగ లనే ఉంటుంది. ఒక్కో పండగ ఒక్కో అనుభూతిని ఇస్తుంది. గోవా కార్నివాల్, సావో జిఓ ఫెస్టివల్, షిగ్మో ఫెస్టివల్, గోవా సింబుర్న్ ఫెస్టివల్, గోవా ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్, బొందెరం ఫెస్టివల్, ఇలా ఇంకా చాల పండుగలు గోవా లో జరుపుకుంటారు. మీ స్నేహితులతో వెళ్తే ఇక్కడ ఉన్న అందాలను చాల బాగా ఆనందిస్తారు.

గోవా ని సందర్శించిన ప్రతి ఒక్కరు ఇంకోసారి వెళ్తే బాగుంటుంది అని తప్పకుండ ఫీల్ అవుతారు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది మనకి కూడా గోవా లో భిన్నత్వాన్ని ఆనందించాలని కచ్చితంగా అనిపిస్తుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి.

You may also like

Leave a Comment