Home » తిరుపతి లో కచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు

తిరుపతి లో కచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు

by Nikitha Kavali
0 comment

భారతదేశం లో ఎంతో ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి ఖచ్చితంగా ఉంటుంది. అందరం తిరుమల కి వెళ్లినప్పుడు ప్రముఖంగా శ్రీవారి దర్శనం మరియు తిరుమల కొండల పైన కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటాం. తిరుమల లోనే కాకుండా తిరుపతి లో కూడా ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అందాలతో ఎంతో సహజంగా ఈ ప్రదేశాలు అందరిని ఎంత గానో ఆకట్టుకుంటాయి.

తిరుపతి లో చూడవలసిన ప్రదేశాల జాబితా

తిరుపతి లో ప్రకృతి అందాలకు  తోవ లేదు ఎటు చుసిన పచ్చని చెట్లు గోవిందా స్మరణలతో ఎంతో మంది భక్తులను, పర్యాటక సందర్శకులను ఆకట్టుకుంటుంది. మీరు మీ కుటుంబం తో కానీ లేదా మీ స్నేహితులతో కానీ శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు తిరుమల కొండ మీదే కాకుండా కొండ దిగువన ఉన్న తిరుపతి లో కూడా ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు చాలానే  ఉన్నాయి. వాటిలో బాగా ప్రాముఖ్యత పొందిన ప్రదేశాలను ఇక్కడ చెప్పబడ్డాయి, ఈసారి మీ ఆత్మీయులతో వచ్చినప్పుడు కచ్చితంగా ఈ ప్రదేశాలను సందర్శించండి.

1. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్

మీరు ప్రకృతి ప్రేమికులు అయితే మీకు ఈ ప్రదేశం కచ్చితంగా నచ్చుతుంది. ఈ జూలోజికల్ పార్క్ s.v. జూ రోడ్ లో ఇది ఉంటుంది. ఇక్కడ పులులు, సింహాలు, వైట్ టైగర్, రకరకాల పక్షులు, ఇంకా ఎన్నో రకాల జంతువులు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.  జూ ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:30 కి తెరవబడుతుంది.

SV Zoo, places to visit in Tirupati

ఇక్కడికి ప్రవేశానికి 50 రూ/ చెల్లించాలి ఒకవేళ మీరు మీ మొబైల్ తీసుకొని వెళ్ళేపని అయితే 70 రూ/ కట్టాలి, చిన్నపిల్లలకి అయితే 20 రూ/ చెల్లించాలి. జూ లోపల పచ్చని చెట్లతో చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఇక్కడ లోపల డిజిటల్ జూ కూడా ఉంటుంది, ప్రతి ఒక్క జంతువుల గురించి ఇక్కడ డిజిటల్ డిస్ప్లే లో ప్రదర్శించబడతుంది ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది.

2. ఇస్కాన్ టెంపుల్

తిరుపతి హరే కృష్ణ రోడ్ లో కృష్ణుడి ఇస్కాన్ గుడి ఉంది. ఇక్కడ కృష్ణుడి ఎనిమిది గోపికలతో చాలా అందంగా ఉంటాడు. ఈ గుడి అంత నీలం రంగు తో చుట్టూ పచ్చని చెట్లతో చూడటానికి చాల అందంగా కనిపిస్తుంది. గుడి లోపలికి వెళ్ళగానే కృష్ణుడు ఇరువైపులా ఎనిమిది మంది గోపికలతో చాల ముద్దుగా ఉంటాడు. కృష్ణుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఎడమ వైపు నుండి బయటికి వెళ్లే దరి ఉంటుంది.

Iskcon Tirupati

అక్కడ ఆ దారి అంత తియ్యటి మిఠాయిలతో, ఆధ్యాత్మిక పుస్తకాలతో, కృష్ణుడి బొమ్మలతో ఒక చిన్న బజార్ లా ఉంటుంది. ఇక బయటికి రాగానే అక్కడ కృష్ణుడికి సంబందించిన మ్యూసియం ఒకటి ఉంటుంది లోపలి వెళ్ళడానికి 20 రూ/ టికెట్ ఉంటుంది. ఆ మ్యూసియం లో కృష్ణుడు పుట్టిన దశలు అన్ని విగ్రహాల రూపం లో చాల చక్కగా చూపబడ్డాయి. ఇది తిరుపతి లో కచ్చితంగా చూడదగిన ప్రదేశం.

3. కపిల తీర్థం

కపిల తీర్థం అలిపిరి కి దగ్గర ఉంటుంది. ఇక్కడ శివుడు శ్రీ కపిలేశ్వర స్వామి రూపం లో దర్శనమిస్తారు. ఈ ప్రదేశం లో జలపాతం చాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వర్షా కాలం అప్పుడు ఇక్కడ జలపాతాలు చూడటానికి చాల అందంగా ఉంటాయి. ఈ గుడి లోపల మీకు అభయాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు.

Kapila theertham, Places to visit in Tirupati

4. గోవిందారాజుల స్వామి ఆలయం

గోవిందరాజుల స్వామి గుడి తిరుపతి లో ఎంతో పేరు ఉన్న పర్యాటక ఆలయం. ఇక్కడ గోవిందరాజుల స్వామి శయనిస్తున్న స్థితిలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం ఇక్కడ గోవిందరాజుల స్వామి వేంకటేశ్వరస్వామి హుండీ లెక్కలను లెక్కపెడుతూ అలసిపోయి ఇక్కడే నిద్రపోయినట్టు పేరుకొంటున్నాయి.

Govindarajula swamy gudi, Tirupati

ఈ ఆలయ ప్రాంగణం లో పెద్ద పుష్కరిణి ఉంది. ఈ ఆలయం లోపల నరసింహస్వామి, కోదండరామస్వామి, ఇంకా కొంతమంది దేవుళ్ళ సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయం లోపలికి సెల్ ఫోన్లు తీసుకువెళ్లకూడదు బయటే కౌంటర్లలో పెట్టాలి.

5. శిల్పారామం

తిరుపతి కి 12 km ఆవరణలో శిల్పారామం అనే అద్భుత శిల్ప కళాప్రదర్శనశాల ఉంటుంది. మరియు ఇక్కడ లోపలి వెళ్లడానికి 50 రూ/ ప్రవేశ ఫీజు కట్టాలి. ఇక్కడ ఆనాటి మనుషుల మనుగడ ను మట్టి బొమ్మల రూపం లో ఎంతో చక్కగా చెక్కి ఉంటాయి. ఇక్కడ లోపల చిన్న పాండ్ ఉంటుంది అక్కడ బోట్ రైడ్ లు కూడా ఎక్కవచ్చు. ఇది కుటుంబంతో కలిసి చూడదగిన ప్రదేశం. ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది.

6. తలకోన జలపాతాలు

ఆంధ్రా ప్రదేశ్ లోనే ఎతైన జలపాతాలు గా పేరు పొందిన తలకోన జలపాతాలు కచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం. తిరుపతి నుంచి 1 1/2 km దూరం లో తలకోన జలపాతాలు ఉంటాయి. ఇక్కడికి చేరుకోడానికి తిరుపతి నుండి బస్సు సౌకర్యం ఉంటుంది. ఉదయం 7:30 మరియు మధ్యాహ్నం 2:30 సమయాలలో తిరుపతి బస్టాండ్ లో బస్సు ఉంటుంది. దట్టమైన శేషాచలం అడవులలో  నుంచి పారె ఈ  నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయి అని అందరు నమ్ముతుంటారు. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు  ఒక మంచి సందర్శన స్థలం. ఇక్కడ ఫోటోలు తీసుకోడానికి, కుటుంబం తో కలిసి పిక్నిక్ వెళ్ళడానికి చాల బాగుంటుంది. 

7. శ్రీనివాస మంగాపురం

తిరుపతి బస్టాండ్ నుండి 10km దూరం లో శ్రీనివాస మంగాపురం ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వరస్వామి కల్యాణ వెంకటేశ్వరస్వామి రూపం లో దర్శనమిస్తారు. మన పురాణాల ప్రకారం వేంకటేశ్వరస్వామి పద్మావతి దేవి తో వివాహం అనంతరం ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెబుతున్నాయి.

8.తిరుచానూరు

తిరుచానూరు రోడ్ లో పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది. దీనిని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పద్మావతి అమ్మవారు వేంకటేశ్వరస్వామి తో కొలువై ఉంటారు. వేంకటేశ్వరస్వామి ని దర్శించుకోవడానికి వెళ్లే ముందుగా ఇక్కడ అమ్మవారి నీ  దర్శించుకోవాలి అని  భక్తులు నమ్ముతారు.

9. చంద్రగిరి కోట

 చంద్రగిరి కోట తిరుపతి కీ సమీపము లో ఉన్న ఒక  అద్భుతమైన చారిత్రక పర్యాటక ప్రదేశం. ఇక్కడికి ప్రతిరోజు చాల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ కోటని 11వ శతాబ్దం లో ఇమ్మడి నరసింహ యాదవరాయ గారు దీనిని విజయనగర శైలి లో నిర్మించారు. ఇక్కడ లోపలికి వెళ్లడానికి 20రూ/  ప్రవేశ ఫీజు  ఉంటుంది. ఈ కోట లోపలికి వెళ్లి పైకి ఎక్కి అక్కడ అందాలను ఆస్వాదించవచ్చు.

10. రీజినల్ సైన్స్ సెంటర్

అలిపిరి జూ పార్క్ రోడ్ లో ఈ రీజినల్ సైన్స్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ ప్లానెటేరియం, సైన్స్ లో వస్తున్న కొత్త ఆవిష్కరణలు, సైన్స్ షోలు, 3డి ఫిలిం షోస్ , ప్రీ-హిస్టారిక్ పార్క్, ఇలా మొదలైనవి చాల ఉన్నాయి. ప్రతి దానికి 30రూ/ నుంచి 50రూ/ వరకు ప్రవేశ ఫీజు ఉంటుంది. ఈ సైన్స్ సెంటర్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:00 వరకు తెరిచి ఉంటుంది మరియు ఆదివారం 10:00 నుండి 6:30 వరకు తెరిచి ఉంటుంది. ఇది పిల్లలకు ఒక మంచి విజ్ఞానాన్ని అందిస్తుంది.

ఈ ప్రదేశాలను కచ్చితంగా మీ స్నేహితులతో కలిసి వెళ్లి చుడండి. మీకు కచ్చితంగా ఎన్నో మధురానుభుతులను అందిస్తాయి. ప్రతి సందర్శన స్థలం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి. 

You may also like

Leave a Comment