Home » మౌంట్  ఎవరెస్ట్(Mount Everest) గురించి ఇవి మీకు తెలుసా!

మౌంట్  ఎవరెస్ట్(Mount Everest) గురించి ఇవి మీకు తెలుసా!

by Vinod G
0 comment

ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అతి ఎతైనది మరియు ప్రసిద్ధి పొందింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి రోజుకు కొన్ని వేలమంది వస్తుంటారు. అందులో కొన్ని వందల మంది మాత్రమే శిఖర అగ్రభాగానికి చేరుకుంటారు. మిగతా వాళ్ళు అక్కడి వాతావరణ పరిస్థితులకు భరించలేక ప్రమాదానికి గురి అవుతుంటారు.

మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు:

ఎవరెస్ట్ శిఖరం చైనా, నేపాల్ దేశ సరిహద్దుల్లో ఉంటుంది. దీని ఎత్తు 8848 మీటర్లు ఉంటుంది. దీనిని “గౌరీ శంకర శిఖరము ” అని కూడా అంటారు. నేపాల్ లో 2015 లో జరిగిన భారీ భూకంపం ప్రభావం ఈ శిఖరం పై పడిందని భావించడం తో 2017 లో ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని నేపాల్ మొదలు పెట్టింది. ఈ ఎవరెస్ట్ శిఖరం టిబెట్ నేపాల్ ఇరు దేశాలలో విస్తరించి ఉంది. కానీ పర్వత ఎక్కువ భాగం మాత్రం నేపాల్ లో ఉంది. ఎత్తును కొలిచేందుకు నిర్వహించే సర్వే ని చైనా పూనుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధిచిన సమాచారాన్ని పంచుకోవడానికి 2019 లో నేపాల్ , చైనా దేశాల నేతలు ఒప్పందం చేసుకున్నారు.


ఏడాది అనంతరం ఇరు దేశాలు ఒక ప్రకటన చేసాయి. అది ఏమిటంటే ఎవరెస్టు శిఖరం యొక్క ఎత్తు మరో 2 సెంటి మీటర్లు ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. ఇరు దేశాల సర్వేయర్లు శిఖరము పైకి చేరుకున్నారు. మాములుగా శిఖరం అధిరోహించడం కంటే ఇప్పుడు శిఖరాన్ని చేరడం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఒక వేళ దీనిని అధిరోహించాలనుకునే పర్వతారోహకులు చాలా మంది శిఖర అగ్ర భాగానికి చేరేసరికి అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. శిఖరం యొక్క అగ్రభాగానికి చేరడం పర్వతారోహకులకు మంచి అనుభూతిని ఇచ్చిన, ఎవరెస్ట్ అధిరోహించాలంటే పర్వతారోహకులు శారీరకంగానూ మరియు మానసికంగానూ చాలా దృఢంగా ఉండాలి.


ఎవరెస్ట్ శిఖరానికి ఆ పేరు ఎలా వచ్చింది:

(Mount Everest)ఎవరెస్ట్ శిఖరానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పర్వతాలను సర్వే చేసే ఒక ఆంగ్లేయ అధికారి ఐన జార్జ్ ఎవరెస్ట్ హిమాలయ శ్రేణి లో పదిహేనవ శిఖరానికి తన పేరు వచ్చేలా ఎవరెస్ట్ అని పెట్టాలనుకున్నాడు.అక్కడ ఉండే శ్రేణి లో ఇది పదిహేనవ శ్రేణి కావడం తో అది “ఎవరెస్ట్ శిఖరము ” అయినది. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరం గా నిలిచింది.

మోంట్ ఎవరెస్ట్ అధిరోహణ:

ఎవరెస్ట్ శిఖరాన్ని దేశ వ్యాప్తంగా ఇప్పటికి వరకు అనేక మంది అధిరోహణ చేసారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉండడం చెప్పుకోదగిన విషయం. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు పర్వతారోహకులు ఎవరెస్టు శిఖరాన్నిఅధిరోహించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ వీరికి శిక్షణని ఇచ్చింది.నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు రాష్ట్రప్రభుత్వం సాయంతో శిక్షణలో పాల్గొన్నారు.

2014 లో ఆ సంస్థలో శిక్షణని పూర్తి చేసుకుని అతి చిన్న వయసులో విజయవంతగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి మాలవత్ పూర్ణ ప్రపంచ రికార్డు సాధించడం విశేషం. ఇందులో భాగంగా మొత్తం పదమూడు మంది ఆ సంస్థలో శిక్షణని తీసుకోగా అందులో ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు కేవలం ఆరుగురిని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది.ఎవరెస్ట్ ను ఎక్కేందుకు సాధారణంగా 45 రోజుల సమయం పడుతుందని, ఈ విద్యార్థులు కేవలం 30 రోజుల్లోనే ఎవరెస్ట్ ని అధిరోయించారు.

ఎవరెస్ట్ శిఖరాన్ని అతి వేగంగా ఎక్కిన తొలి మహిళ ఎవరు?

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ జుంకో టాబే. ఆమె ఒక జపనీస్ పర్వతారోహకురాలు, రచయిత, ఉపాధ్యాయురాలు. మరిన్ని వివరాల కోసం తెలుగు రీడర్స్ విహారి ని సంప్రదించండి

You may also like

Leave a Comment