Home » హైదరాబాద్ స్ట్రీట్ బజార్ల అందాలు

హైదరాబాద్ స్ట్రీట్ బజార్ల అందాలు

by Nikitha Kavali
0 comments

హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి బిర్యానీ గుర్తు వస్తుంది. కానీ హైదరాబాద్ బిర్యానీ కె కాదు స్ట్రీట్ బజార్ లకి కూడా బాగా ఫేమస్. హైదరాబాద్ స్ట్రీట్ బజార్ లలో అన్ని రకాల వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. ఆ బజార్లు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూసేదం రండి.

1. బేగం బజార్
2. మొజంజాహి మార్కెట్
3. శిల్పారామం
4. సుల్తాన్ బజార్
5. లాడ్ బజార్
6. నాంపల్లి
7. చార్మినార్ బజార్
8. అబిడ్స్ స్ట్రీట్

బేగం బజార్:

ఈ బజార్ ఓల్డ్ సిటీ లో నయా పూరి బ్రిడ్జి కి హాఫ్ కిలోమీటర్ దూరం లో ఉంటుంది. ఇక్కడ బిద్రీ వర్క్స్ చేసిన మెటల్ వస్తువులు, ఇంటి డెకొరేషన్ కి సంబందించిన వస్తువులు, ఇత్తడి వస్తువులకు ఎంతో ఫేమస్. ఈ బజార్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ బజార్ ఆదివారం రోజు మూసేసి ఉండబడుతుంది.

మొజంజాహి మార్కెట్:

ఇది చాల చారిత్రాత్మకమైన మార్కెట్ ఇది 20వ శతాబ్దం లో నిర్మిచిన మార్కెట్. మోజంజాహి మార్కెట్ లో ఎన్నో రకాల అత్తర్లు ఇక్కడ బాగా దొరుకుతాయి, ఇత్తడి వస్తువులు, మరియు పూలు చాల బాగా ఫేమస్. ఈ మార్కెట్ ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటలకు ఓపెన్ లో ఉంటుంది.

శిల్పారామం:

మాదాపూర్ రోడ్ లో హైటెక్ సిటీ దగ్గర ఈ శిల్పారామం ఉంటుంది. ఇక్కడ హస్తకళల వస్తువులు, చందేరి చీరలు, మన భారత సంస్కృతి కి సంబందించిన దుస్తులు, వస్తువులు అన్ని దొరుకుతాయి. ఈ హ్యాండీక్రాఫ్ట్ బజార్ ఉదయం 10:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.

సుల్తాన్ బజార్:

హైదరాబాద్ లో సుల్తాన్ బజార్ బాగా ఫ్యామినోస్ ఇది ఎంతో పాతది అయినా కూడా చాల మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాల రకాల పుస్తకాలు, గాజులు, ఆడవారికి కావలసిన నగలు, డ్రెస్సులు, మంచి స్ట్రీట్ ఫుడ్, ఇంకా అన్ని రకాల వస్తువులు ఇక్కడ తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఇది ఉదయం 11 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది.

లాడ్ బజార్ :

హైదరాబాద్ లో ఫేమస్ బజార్ చెప్పమని అడిగితే కచ్చితంగా చాల మంది లడ్డు బజార్ అని చెప్తారు. ఇది చార్మినార్ రోడ్, చార్ కామన్ దగ్గర్లో ఉంటుంది. ఈ బజార్ ఎప్పుడు జనాభా తో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ లాడ్ బ్యాంగిల్స్, ముత్యపు నగలు, పెళ్లి కుమార్తెలకు కావలసిన నగలు చీరలు చాల బాగా పాపులర్. ఈ బజార్ ఉదయం 11:30 నుండి రాత్రి 10:30 వరకు తెరిచి ఉంటుంది.

నాంపల్లి:

నాంపల్లి బజార్, నాంపల్లి బజార్ గేట్ దగ్గర ఉంటుంది ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు, అన్ని రకాలా గృహోపకరణాలు ఇక్కడ బాగా లభిస్తాయి. ఈ బజార్ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.

చార్మినార్ బజార్:

ఇది చార్మినార్ రోడ్, చార్ కామన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల అత్తర్లు, కర్ర దుప్పటా లు, చెప్పులు, విభిన్న రకాల దుస్తులు, మెటల్ స్లిన్గ్ బ్యాగ్ లు, ఇలా అన్ని రకాలా వస్తువులు బాగా దొరుకుతాయి. ఈ బజార్ లో దుఖాణాలు ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి.

అబిడ్స్ స్ట్రీట్:

అబిడ్స్ స్ట్రీట్ హైదరాబాద్ లో చాలా బాగా ఫేమస్. ఇక్కడ ఫాన్సీ జ్యువలరీ ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచి దుస్తులు అన్ని ఇక్కడ కొంచెం తక్కువ ధరకే లభిస్తాయి. ఈ స్ట్రీట్ లో దుకాణాలు అన్ని ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు తెరిచి ఉంటాయి.

హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అక్కడ ఉన్న మాల్స్ ఏ కాకుండా తప్పకుండా వెళ్లాల్సిన బజార్లు కూడా ఉన్నాయి. ఈసారి మీ స్నేహితులతో కలిసి వెళ్ళండి.

మరిన్ని అద్భుతమైన ప్రదేశాల కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి.

You may also like

Leave a Comment