47
కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, కాజల్, SJ సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ చిత్రం జులై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ను ముందుగా జూన్ 25న విడుదల చేస్తున్నారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.