Home » కల్కి 2898 AD సినిమా.. ఒక్కో టికెట్ రూ.2,300

కల్కి 2898 AD సినిమా.. ఒక్కో టికెట్ రూ.2,300

by Shalini D
0 comments

హీరో ప్రభాస్ ‘KALKI 2898AD’ రేపు రిలీజ్ కానుంది. ఆన్‌లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760, రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.

కల్కి 2898 AD సినిమా ఆసక్తికరమైన ఫిక్షన్ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు, దీన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు.
ఈ సినిమా తాజాగా యూఎస్‌లో రికార్డును నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్కి సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమాకు అర్ధరాత్రి షోలు ప్రారంభమయ్యాయి. ప్రమోషన్స్ మరియు డబ్బింగ్ పనులు మార్చి నుంచి మొదలయ్యాయి.
ఈ సినిమాలో దీపిక పాడుకోణ్ తెలుగు డెబ్యూ కాదు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ ఎలిమెంట్స్‌ను జోడించారు.

కల్కి ప్రీసేల్స్‌:

‘కల్కి’ సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఏకంగా 1.5 లక్షల టికెట్లు అమ్ముడై $4 మిలియన్ల ప్రీసేల్ బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించబోతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు కల్కికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు కలెక్షన్స్ వస్తాయని చెబుతున్నారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి

You may also like

Leave a Comment