విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ #VD12 కొత్త షెడ్యూల్ శ్రీలంకలో మొదలుకానుంది. వచ్చే వారం నుంచి 40 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా ఇటీవల వైజాగ్‌లో 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. సముద్రం నేపథ్యంలో కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కించారు. తాజా సమాచారం ప్రకారం తదుపరి షెడ్యూల్‌ను శ్రీలంకలో జరుపబోతున్నారని తెలిసింది.
దాదాపు మూడు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటారని చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అందులో ఓ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకుడు. గ్రామీణ నేపథ్య యాక్షన్ కథాంశమిది. మరో చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుండగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854-1978 మధ్య జరిగిన చారిత్రక యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.