Home » గర్భిణులకు ఫోలీక్ యాసిడ్ చాలా ముఖ్యం…

గర్భిణులకు ఫోలీక్ యాసిడ్ చాలా ముఖ్యం…

by Vinod G
0 comment

మహిళలకు తల్లి కావాలనే కోరిక ఉంటుంది, ఈ కోరికను నెరవేర్చుకోవడంలో ఫోలీక్ యాసిడ్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. సాధారణంగా గర్భం దాల్చాలి అనుకునే మహిళలకు, అలాగే గర్భం దాల్చిన వారికి ‘ఫోలీక్ యాసిడ్’ చాలా ముఖ్యమని డాక్టర్లు చెబుతుంటారు. ఎందుకంటే ఇది తల్లి గర్భంలోని పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇంతకీ ఈ ఫోలీక్ యాసిడ్ అంటే ఏమిటి? అనుకుంటున్నారా అయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఫోలీక్ యాసిడ్ లేదా ఫోలెట్ అనేది బీ విటమిన్ లో ఒక రకం. విటమిన్ బీ9 లోని ఒక రకన్నే ఫోలెట్ అంటారు. ఇది మన శరీరంలో కొత్త కణాల ఏర్ఫాటుకు, న్యూక్లియిక్ యాసిడ్ ఉత్పత్తికి, ఇంకా ఇతర శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

ఉపయోగాలు:

  • ఫోలిక్ యాసిడ్ తల్లి గర్భంలో పిండం అభివృద్దికి సహాయపడుతుంది.
  • కడుపులోని బిడ్ద మెదడు, వెన్నుపాము, కేంద్ర నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఎలాంటి నష్టం, లోపాలు లేకుండా కాపాడుతుంది.
  • ప్రెగ్నెన్సీ సమయంలో ఇది సరిపడినంత తీసుకోవడం వల్ల శిశువులకు గ్రహణం, మొర్రి వచ్చే అవకాశం తగ్గుతుంది.
  • గర్భస్రావం, పిండం ఎదుగుదలలో లోపాలు, నెలలు నిండకుండా తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది.
  • ప్రెగ్నెన్సీ సమయంలో ఇరన్ లోపం నివారించడానికి ‘ఫోలిక్ యాసిడ్’ అవసరం.
  • అలాగే గర్భిణులకు హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్లు, ఆల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశన్ని తగ్గిస్తుంది.
  • గర్భంలో బిడ్డ తొందరగా ఎదగడానికి, చర్మం మెరవడానికి, వెంట్రుకలు చక్కగా పెరగడానికి ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది.

ఫోలిక్ యాసిడ్ ఎక్కువ లభించే పదార్ధాలు:

సాధారణంగా గర్భిణులకు వైద్యులు మాత్రలు, సిరప్ ల ద్వారా ఫోలిక్ యాసిడ్ ను సిఫార్సు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా మందులతో మాత్రమే కాకుండా… ఆహార పదార్థాలతో కూడా ఫోలిక్ యాసిడ్ ను పొందవచ్చు.

పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటింది. కాబట్టి రెండు రోజులకు ఒకసారి పాలకూరను తినడం చాలా మంచిది.

క్యాబేజి, తృణధాన్యాలు, శనగలు, రాజ్మా, ఆరెంజ్ పండ్లు, కరివెపాకు, మెంతికూర, మెంతులు, తోటకూర, చిక్కడు, బెండకాయ, గుడ్డు, బచ్చలి కూర, అరటిపండ్లు, బీన్స్, బ్రకోలి, బీట్ రూట్, ఆవు పాలలో కూడా ఫోలీక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పదార్ధాలలో వేటిని తీసుకోవాలని డాక్టరును అడిగి మీ డైట్ లో చేర్చుకోండి.

సాధారణంగా గర్భిణులు రోజుకి 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చని వైద్య నిపుణుల సూచన, ఈ విషయంలో వైద్యుని సలహా తీసుకుని అనుసరించడం మంచిది..

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment