Home » పేరు రెయిన్బో మౌంటెన్ గురించి మీకు తెలుసా…

పేరు రెయిన్బో మౌంటెన్ గురించి మీకు తెలుసా…

by Lakshmi Guradasi
0 comments
peru ausangate rainbow mountain

అవును మీరు చదివింది నిజమే!, ఇప్పటివరకు మనం ఆకాశంలో ఏర్పడే ఇంద్రధనుస్సును మాత్రమే చూసాం. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం రెయిన్బో మౌంటెన్ గురించి. ఇది ఆకాశం లో వచ్చే రెయిన్బో ల ఇలా వచ్చి ఆలా వేలాది కాదు. ఈ రంగులు సూర్యుడి ఎండ తో కొండా మీద ఏర్పడతాయి. ఈ రెయిన్బో మౌంటెన్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అయింది.

రెయిన్బో మౌంటైన్, దీనిని వినికుంకా అని కూడా పిలుస్తారు, ఇది పెరూలోని అండీస్ పర్వతాలలో ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది కుస్కోకు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఔసంగేట్ ప్రాంతంలో ఉంది. ఈ పర్వతం దాని రంగులతో  ప్రసిద్ధి చెందింది. ఇది రెడ్ , పరపుల్, పసుపు రంగులతో ఇంద్రధనస్సుల కనిపిస్తుంది. ఈ పర్వతాన్ని స్థానిక ప్రజలు పవిత్ర స్థలంగా భావిస్తారు. కుస్కో అనే దేవత వెలిసినట్టు భావిస్తారు, పూజలు కూడా చేస్తారు. 

మట్టి లోని రాగి, ఇనుము మరియు కాల్షియం వంటి వివిధ ఖనిజాలు  గాలికి ఎక్సపోజ్ అయ్యే ఖనిజాలు. వీటితో పాటు ఐరన్ ఆక్సైడ్ వల్ల రెడ్ కలర్, లిమోనైట్ లేదా జియోటైట్ వల్ల బ్రౌన్ కలర్, ఐరన్ సల్ఫేట్ వల్ల పసుపు రంగు, క్లోరైట్ వల్ల ఆకుపచ్చ వంటి రంగులు ఫామ్ అవడానికి కారణమైన ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉండడం వలన కొండలపై రంగులు ఏర్పాడాయి. 

రెయిన్‌బో మౌంటైన్ ట్రెక్ 5,000 మీటర్లు కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీనిని చేరుకోవడానికి నాలుగు నుండి ఐదు రోజుల పాటు పడుతుంది. 

రిమోట్ ఆండియన్ కమ్యూనిటీల గుండా మౌంటెన్ కు వెళాల్సివుంటుంది. ఆలా వెళ్తున్నప్పుడు చూసేందుకు చుట్టుపక్కల ఉన్న పర్వతాలు, సరస్సులు ఆకర్షణీయంగా ఉంటాయి. హైకర్లు ఆండియన్ గ్రామాల గుండా వెళతారు కాబట్టి స్థానిక ప్రజలతో మాట్లాడే ఆవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా స్నేహపూర్వకంగానే స్వాగతిస్తారు. 

ట్రెక్‌లో ఎత్తైన ప్రదేశాలు అరపా పాస్ (4,850 మీటర్లు/16,000 అడుగులు) మరియు పలోమణి పాస్ (5,165 మీటర్లు/17,000 అడుగులు).

రెయిన్‌బో మౌంటైన్‌ని చూసేందుకు ఉత్తమ సమయం మే నుండి సెప్టెంబరు వరకు, అప్పుడు వాతావరణం స్పష్టంగా మరియు ఎండగా ఉంటుంది. ఈ ప్లేస్ మరపురాని అనుభూతిని అందిస్తుంది.

రెయిన్‌బో మౌంటైన్ హికెర్స్ కు, అడ్వెంచర్స్ కు పాపులర్ ప్లేస్ గా మారింది. హైకర్లు కుస్కో ప్రాంతంలోని ఎత్తైన శిఖరం అయిన ఔసంగేట్ పర్వతంతో పాటు చుట్టుపక్కలున్న ప్రకృతి దృశ్యలను చూసి అనుభూతి చెందుతారు. 

ట్రెక్ స్వయంగా లేదా గైడ్ సాయంతో చేయవచ్చు, ఇది రిమోట్ లొకేషన్ కనుక ఛాలెంజింగ్ గా ఉంటుంది. ట్రెక్‌లో సహాయం చేయడానికి ట్రైనెడ్ గైడ్‌లు, పోర్టర్‌లు ఉంటారు. వారు సురక్షితమైన, సహాయక జాగ్రత్త లు అందిస్తారు. ట్రెక్ ఖర్చు టూర్ ఆపరేటర్ పై ఆధారపడి ఉంటుంది, అయితే నాలుగు రోజుల ట్రెక్ కోసం ఒక్కొక్కరికి సుమారు $500-$700 వరకు ఉంటుంది. 

అక్కడ ప్రజలు ఈ పర్వతానికి ఎవరు ఎలాంటి హాని తలపెట్టకుండా జాగ్రత్త గా చూసుకుంటారు. పెరూ యొక్క సౌందర్యాన్ని, ఆండియన్ ప్రజల కల్చర్ ని చూసేందుకు ఈ ట్రెక్ ఒక గొప్ప మార్గం.

ఔసంగేట్ ఇంద్రధనస్సు పర్వతం (Ausangate rainbow mountain exact location)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను చుడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.