Home » బియ్యం పిండితో చర్మాన్ని మెరిపించే అందం

బియ్యం పిండితో చర్మాన్ని మెరిపించే అందం

by Shalini D
0 comments

చాలా తక్కువ ఖర్చుతోనే బియ్యప్పిండితో చర్మాన్ని మెరిపించే చిట్కాలు ఉన్నాయి. ఇది మీ ముఖానికి మెరుపుని ఇస్తుంది. బియ్యప్పిండిని ఇందుకోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. బియ్యప్పిండి తెలుగు ఇళ్లల్లో సాధారణంగా ఉంటుంది. దీంతో అనేక రకాల వంటకాలు చేస్తారు. ఈ బియ్యప్పిండి చర్మాన్ని మెరిపించడంలో ముందుంటుంది. ఇది మీ చర్మం పై అద్భుతాలు చేస్తుందని చెప్పవచ్చు. దీనివల్ల మీ చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఇది చర్మంపై దురదలు, దద్దుర్లను తగ్గిస్తుంది. అలాగే అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం జిడ్డు కారకుండా ఉంటుంది. ఈ పిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది. బియ్యప్పిండి రెడీ అయిపోతుంది. దీన్ని తెల్ల బియ్యం మాత్రమే కాదు, బ్రౌన్ రైస్ తో కూడా తయారు చేయవచ్చు.

బియ్యం పిండితో అందం: వేల సంవత్సరాలగా ఆసియా దేశాల్లోని మహిళల చర్మానికి, జుట్టుకు ఈ బియ్యప్పిండి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను అరికట్టడంలో కూడా ఇది ముందుంటుంది. బియ్యప్పిండిని ఉపయోగించి చర్మంపై ఉన్న మురికిని మృత కణాలను తొలగించుకోవచ్చు. బియ్యప్పిండికే కాస్త ముతక స్వభావం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్స్ ఫోలియంట్ గా పనిచేస్తుంది.

ఈ బియ్యప్పిండిలో కాస్త నీరు చేర్చి పేస్టులా చేయాలి. దాన్ని ముఖం మీద రాసుకోవాలి. బాగా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేస్తే చర్మంపై ఉన్న మురికిని ఇది తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

బియ్యప్పిండి చర్మంలోని అదనపు నూనెను గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది జిడ్డు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బియ్యప్పిండితో ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకుంటూ ఉండండి. కొన్ని రోజుల్లోనే మీకు ఇది చేసే మ్యాజిక్ తెలుస్తుంది.

బియ్యం పిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇది చర్మానికి పూయడం వల్ల చికాకు కలిగించే కారకాలను తొలగిస్తుంది. అలాగే మంటను తగ్గిస్తుంది. చర్మంపై దురద వంటి లక్షణాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బియ్యప్పిండిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.

బియ్యప్పిండి చర్మంలో తేమను నిలిచేలా చేస్తుంది. కాబట్టి చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎప్పుడైతే చర్మంలో తేమవంతంగా ఉంటుందో. అది మృదువుగా కనిపిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.

బియ్యంపిండి ఫేస్ మాస్కులు: బియ్యప్పిండిలో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించండి. పావుగంట సేపు వదిలేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మురికిని తొలగిస్తుంది. అలాగే బియ్యప్పిండిలో పెరుగు కలుపుకుని ఫేస్ మాస్కులా వేసుకున్నా మంచిదే. బియ్యప్పిండి, ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ కలిపి జిడ్డు చర్మం ఉన్నవారు ఫేస్ మాస్క్‌లా వేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. బియ్యప్పిండి, పాలు కలిపి లేదా బియ్యప్పిండి, పసుపు కలిపి ఫేస్ మాస్కులుగా వేసుకున్నా మంచిదే.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment