Home » ఎలగెలగా ఎలగా ఎలగెలగా – పరుగు

ఎలగెలగా ఎలగా ఎలగెలగా – పరుగు

by Rahila SK
0 comment

చిత్రం: పరుగు
పాట: ఎలగెలగా ఎలగా ఎలగెలగా
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
గాయకులు: కైలాష్ ఖేర్, సైంధవి
సంగీత దర్శకుడు: మణి శర్మ
సంవత్సరం: 2008


ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా

ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావు
ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు
ఎల్లా నా దారినిట్ఠా మార్చివేసావు
ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావు

ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా

పిల్లా నీ లాంటిదాన్నే కోరుకున్నాను
పిల్లా ఆ మాట నాలో దాచుకున్నాను
పిల్లా నేనింత కాలం వేచి ఉన్నాను
పిల్లా ఆ చోట నిన్నే చూసుకున్నాను

ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా

కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్చాడు
సరిగా నా గుండెపై నీ బొమ్మ గీశాడు

ఎలగెలగా ఎలగా

ఇదిగో ఈ పిల్ల నీకు జంట అన్నాడు
పరుగున వెళ్లమంటూ తన్ను తన్నాడు

ఎలగెలగా ఎలగా

కొండను దాటి కోనలు దాటి
గుట్టలు దాటి గట్టులు దాటి
దెబ్బకు అక్కడ ఎగిరి పడ్డాను
నీ దగ్గర పడ్డాను

అలగలగా అలగా అలగలగా
అలగలగా అలగా అలగలగా

అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేశాను
అల్లా నీ లోపలే ఈ గోల పెంచాను
అల్లా నీ దారినట్ఠా మార్చివేసాను
అల్లా నా దారిలోకి తీసుకొచ్చాను

అలగలగా అలగా అలగలగా
అలగలగా అలగా అలగలగా

ఎపుడో మా బామ్మ నాకో మాట చెప్పింది
ఎవడో వల వేసి నన్నే లాగుతాడంది

ఎలగెలగా ఎలగా

పోవే నే వెర్రిదాన్నేం కాదు అన్నాను
కాని నువ్వు ముందుకొస్తే ఆగుతున్నాను

ఎలగెలగా ఎలగా

ఎప్పటికప్పుడు ఏమవుతాదని
చెయ్యని తప్పులు ఏం చేస్తానని
నిద్దర మాని ఆలోచిస్తున్న
నిన్ను ఆరాతీస్తున్న

ఎలగెలగా ఎలగా ఎలగెలగా
అలగలగా అలగా అలగలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఇలగిలగా ఇలగా ఇలగిలగా
ఇలగా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment