Home » సిన్ని గుండె నేడే ఆడమన్నదే- జవాన్ 

సిన్ని గుండె నేడే ఆడమన్నదే- జవాన్ 

by Farzana Shaik
0 comment

హీరో : షా రుఖ్ ఖాన్

హీరోయిన్ : నయనతార

సింగర్ : అనిరుద్ రవిచందర్

లిరిసిస్ట్ : చంద్రబోస్

మూవీ : జవాన్


సిన్ని గుండె నేడే ఆడమన్నదే
అయినా బిడియమేదో ఆపే… (రెడీ)

దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్
ధూలే రేగేలా ఎగిరి దుముకురా
భూమే బెనికేలా అదర అదరగొట్టెయ్
నింగే వణికేలా ఎగిరి దుముకురా

ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

చిలిపితనము ఉండాలోయ్
చెలిమి గుణము ఉండాలోయ్
కరుణ తపన ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

ఊపిరి వెచ్ఛంగా, ఊహలు పచ్చంగా
హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్
హేయ్, హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్

ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే

లోకంలో నువ్వే లేవంటాను
నీలోనే లోకం ఉందంటాను
ప్రేమించే తత్వం చాలంటాను
వేరే వేదాంతం వద్దంటాను

ఎగుడు దిగుడు కలపాలోయ్
అడుగు నీడ కలవాలోయ్
కలుపుగోలుగుండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చెమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్

కొంచెం సరదాగా, కొంచెం మర్యాద
అంతా మనసారా ఉంటె మనిషండోయ్
అరె, అంతా మనసారా ఉంటె మనిషండోయ్ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే

మరిన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment