Home » పిచ్చిగా నచ్చేసావే – గం గం గణేశా

పిచ్చిగా నచ్చేసావే – గం గం గణేశా

by Rahila SK
0 comment

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
కళ్ళలో జల్లేసావే
రంగులన్నీ భలేగా

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
జంటగా వచ్చేసానే
అందుకనేగా

మనసే పట్టీ పట్టీ
మాయాలోకి నెట్టేసావే
ప్రేమ గట్టీ గట్టీ
కంకణంలా కట్టేసావే

నీ మువ్వల పట్టి
గుండెకి చుట్టీ మోగించేసావే
ఆ కాటుక పెట్టి
కవితలిట్టే రాయించేసావే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

ఇంకేం కావాలే
నాకింకేం కావాలే
రెప్పలపైనా చుక్కలవానై దూకావులే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

నువ్ కొట్టూ
బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే
దాచిపెట్టుకున్నాలే

బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
కళ్ళలో జల్లేసావే
రంగులన్నీ భలేగా

పిచ్చిగా నచ్చేసావే
రంగు తూనీగా
జంటగా వచ్చేసానే
అందుకనేగా

ఏ చూపులా దారం కట్టి
అట్టా ఇట్టా లాగితే
ఊపిరాగిపోకుండా ఎట్టా ఉంటాదే

నవ్వుతు నరం పట్టి
అటూ ఇటు ఊపితే
నొప్పి కూడా హాయిగా బాగుంటాదే

ఎదలో బందిపోటు
దొంగలా దూరేసావే
నీ పంటిగాటు
ప్రేమగా పెట్టేసావే

నువ్ తిట్టే తిట్టు
కమ్మగానే ఉంటాదిలే
చావగొట్టు కొట్టు
సమ్మగానే ఉంటాదిలే

నా నిద్దరనిట్టే
బద్దలు కొట్టే అందం నీదేలే
నిన్ను వదిలిపెట్టి
ఉండాలంటే పిచ్చోన్నవుతాలే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

ఇంకేం కావాలే
నాకింకేం కావాలే
రెప్పలపైనా చుక్కలవానై దూకావులే

అలెలే ఆల్లే
నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో
బొంగరంలా తిరిగేస్తాలే

నువ్ కొట్టూ
బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే

బుల్లి పిట్టా బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే


పాట: పిచ్చిగా నచ్చేసావే
లిరిసిస్ట్: సురేష్ బనిశెట్టి
గాయకులు: అనురాగ్ కులకర్ణి
చిత్రం: గం గం గణేశా (2024)
తారాగణం: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment