Home » అమ్మ పాట సాంగ్ లిరిక్స్ – 2024

అమ్మ పాట సాంగ్ లిరిక్స్ – 2024

by Vinod G
0 comment

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట

నిండు జాబిలి చూపించి
రెండు బుగ్గలు గిల్లేసి
నిండు జాబిలి చూపించి
గోటితో బుగ్గను గిల్లేసి

ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన
ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన
అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట

కురిసే వాన చినుకులకి
నీలినింగి అమ్మ
మొలిచే పచ్చని పైరులకి
నేలతల్లి అమ్మ

కురిసే వాన చినుకులకి
నీలినింగి అమ్మ
మొలిచే పచ్చని పైరులకి
నేలతల్లి అమ్మ

వీచే చల్లని గాలులకి
పూలకోమ్మ అమ్మ
ప్రకృతిపాడే పాటలకి
యలకోయిల అమ్మ

సృష్టికి మూలం అమ్మతనం
సృష్టికి మూలం అమ్మతనం
సృష్టించలేనిది అమ్మ గుణం

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట

నింగిని తాకే మేడలకి
పునాది రాయి అమ్మ
అందంపొందిన ప్రతి శిలకి
ఉలిగాయం అమ్మ

నింగిని తాకే మేడలకి
పునాది రాయి అమ్మ
అందంపొందిన ప్రతి శిలకి
ఉలిగాయం అమ్మ

చీకటి చెరిపే వెన్నెలకి
జాబిల్లి అమ్మ
లోకం చూపే కన్నులకి
కంటిపాప అమ్మ

అమ్మంటే అనురాగ జీవనీ
అమ్మంటే అనురాగ జీవని
అమ్మ ప్రేమే సంజీవని

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
మమ్మ… అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట

నిండు జాబిలి చూపించి
రెండు బుగ్గలు గిల్లేసి
నిండు జాబిలి చూపించి
గోటితో బుగ్గను గిల్లేసి

ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన
ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన

అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
మా అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట…


పాట పేరు : అమ్మపాట
నిర్మాత: రవి వై & మిట్టపల్లి స్టూడియో
లిరిసిస్ట్: సురేందర్ మిట్టపల్లి
దర్శకుడు & డాప్: తిరుపతి గౌని
గాయని: జాన్హవి యర్రం
సంగీతం: సిస్కో డిస్కో
ఎడిటర్: అశోక్ కర్రి

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment