Home » అనితా నా అనితా సాంగ్ లిరిక్స్ – పార్ట్ 2 (Love Failure Song)

అనితా నా అనితా సాంగ్ లిరిక్స్ – పార్ట్ 2 (Love Failure Song)

by Lakshmi Guradasi
0 comments

అతడు : నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే
ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే
ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడాక నా మనసే
నే చెచ్చెవరకైనా నా కోసం నువ్వు వస్తావా

అనితా అనితా….
అనితా నా అనితా …..
నా ప్రాణమైన అనితా
మరు జన్మే ఒక్కటుంటే
నీకై మళ్ళీ పుడతా

నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే
ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే

నీ పేరునే తలచుకొని క్షణమంటూ లేదే
నిన్నే నే తలచుకునే రోజాంటూ ఇక రాదే
గుడిలో దేవత ఉందొ లేదో తెలియదు గాని
నా గుండె గుడిలోన దేవతవే నీవమ్మా
అందమైన ఈ జ్ఞాపకాలనీ
విది వారమంటూ నేను స్వాగతించాన

ఏ ఆశ ఇంకా లేనే లేదే
నా గుండెలోన బాధ నీవే
నీ మీద ఉన్న పిచ్చి ప్రేమే
నన్నింకా వెంటాడనే

అనితా అనితా….
అనితా నా అనితా …..
నా ప్రాణమైన అనితా
మరు జన్మే ఒక్కటుంటే
నీకై మళ్ళీ పుడతా

నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే
ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే

ఏ దేవుడు రాశాడో మన ప్రేమ కథను
ఎప్పుడు కలవని రాతనీ రాశాడు చూడు
కలనైనా ఇల్లనైన మన ప్రేమే ఓ చరితం
కథ గాదు నిజమిదే ప్రతి ప్రేమికుడికి అంకితం

నీ మీదనే నా ఈ ప్రాణం
నీకోసమే నే పాడే గానం
ప్రతి జన్మకి నువ్వు నా దానివి
నన్ను కాదన్నా నేను నీ వాడిని
నువ్వు బాగుంటే చాలంది నా మాది
లోకాన్నే విడిచేళ్తున్న

అనితా అనితా….
అనితా నా అనితా …..
నా ప్రాణమైన అనితా
మరు జన్మే ఒక్కటుంటే
నీకై మళ్ళీ పుడతా

నా ప్రాణమ నన్నే క్షమించవా
ఈ జన్మకి నిన్ను కలవలేనికా
పదే పదే నా మనస్సు
నువ్వు కావాలనుకున్నా
నీకోసం కన్నుపాప్పే కన్నీరే పెడుతున్న

ఆమె : ప్రాణం ప్రాణం……
ప్రాణం నా ప్రాణం……
నీ మీదే నా ప్రాణం
నీకోసం నే రాలేక నలిగింది హృదయం
నన్నే విడి వెళ్ళావా తిరిగిరాని దూరం
నా వల్లే ఈ గోరం

నిన్ను తలచి తలచి
తల్లడిల్లేను ప్రాణం
నిన్ను తలచి తలచి
తల్లడిల్లేను ప్రాణం
ఒట్టేసి చెబుతున్న నీకై నే మళ్ళీ వస్తా

ప్రాణం ప్రాణం……
ప్రాణం నా ప్రాణం……
నీ మీదే నా ప్రాణం
నీకోసం నే రాలేక నలిగింది హృదయం

______________________________________________________

పాట: అనిత నా అనిత పార్ట్ – 2 సాంగ్ (Anitha Naa Anitha Part – 2 Song)
గాయని & రచయిత: అనిత’నాగరాజు (Anitha Nagaraju)
సంగీతం: రవి కళ్యాణ్ (అల రవి) (Ravi Kalyan ( Ala Ravi ))
నటీనటులు: అక్షిత్ మార్వెల్ (Akshith Marvel), వైష్ణవి సోని (Vaishnavi Soni) మరియు వాణ్య అగర్వాల్ (Vaanya Aagarwal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment