Home » రాధే గోవిందా (Raadhe Govinda) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

రాధే గోవిందా (Raadhe Govinda) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

by Rahila SK
0 comments

సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా

ప్రియ పురుషా వరసా
ఇహ కలిపేయమంటా
మృదువదనా పతినై
పరిపాలించనా

చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే
బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా

నీ కోసమే పుట్టానని
ఊరించకోయ్ వాత్సాయనా
నా కోసమే వచ్చావని
వాటేసినా వయ్యారమా

తొలిప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంటా
చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా
కౌగిళ్ల జాతరే జరగాలంటా

అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా
సోకుల తోటే షాకులు ఇస్తా
ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా

కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా
కిస్ మై లిప్సంటూ కవ్వించిందా
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా

అంగాంగమూ వ్యామోహమే
నీ పొందుకై ఆరాటమే
వదిలేసి నీ మోమాటమే
సాగించవోయ్ సల్లాపమే

రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
ఏకాంత సేవనే చెయ్యాలంటా
కసిగువ్వ రెక్కలే విప్పిందంటా
నీ కోసం పక్కలే పరిచిందంటా

అరె మెత్తగ వస్తే హత్తుకు పోతా
హత్తుకు నిన్ను ఎత్తుకు పోతా
సిరినే మగసిరితో దోచేస్తా భామా

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటు కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా

ప్రియ పురుషా వరసా
ఇహ కలిపేయమంటా
మృదువదనా పతినై
పరిపాలించనా

చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే
బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా


పాట: రాధే గోవిందా (Raadhe Govinda)
లిరిసిస్ట్: భువన చంద్ర
గాయకుడు: ఉదిత్ నారాయణ్, K.S. చిత్ర
చిత్రం: ఇంద్ర (2002)
తారాగణం: ఆర్తి అగర్వాల్, చిరంజీవి, సోనాలి బింద్రే
సంగీత దర్శకుడు: మణి శర్మ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.