Home » ఎప్పటికి (వేయి కన్నులతో) సాంగ్ లిరిక్స్ – నీ స్నేహం

ఎప్పటికి (వేయి కన్నులతో) సాంగ్ లిరిక్స్ – నీ స్నేహం

by Lakshmi Guradasi
1.6K views
Veyi Kannulatho song lyrics Nee Sneham

Yeppatiki (Veyi Kannulatho) Lyrics

Male:

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం

నీ చెలిమే ఊపిరిలా బ్రతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరిన సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్న నిన్ను పిలిచేదెలాగమ్మా
అందాల ఆకాశమా

Female :

వేయి కన్నులతో ఉహ్హు ఉ హు హ్హు
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా

ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి మ్మ్ ఒక్కసారి ల ల ల
ఒక్కసారి అయినా చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం

ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని

వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా

________________________________

సాంగ్ : ఎప్పటికి (వేయి కన్నులతో)
సినిమా పేరు: నీ స్నేహం
నిర్మాత: ఎం.ఎస్.రాజు
దర్శకత్వం: పరుచూరి మురళి
నటీనటులు: ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్
సంగీతం: R.P.పట్నాయక్
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: R.P.పట్నాయక్, ఉష

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.