Home » కొమురం భీముడో సాంగ్- RRR 

కొమురం భీముడో సాంగ్- RRR 

by Manasa Kundurthi
0 comment

RRR తెలుగు సినిమా విడుదల తేదీ – 25 మార్చి 2022

దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి

డివివి: దానయ్య నిర్మాత

గాయకుడు: కాల భైరవ

సంగీతం: ఎం ఎం కీరవాణి

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ

స్టార్ కాస్ట్: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్రఖని, అలిసన్ డూడీ.


కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
రగరాగా సూరీడై… రగలాలి కొడుకో
రగలాలి కొడుకో, ఓ ఓఓ

కాల్మొక్తా బాంచేనని వంగి తోగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో, ఓ ఓఓ

జులుము గద్దెకు తలను వంచి తోగాలా
జుడుము తల్లీ పేగున పెరగానట్టేరో
పెరగానట్టేరో, ఓ ఓఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ

సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా
సినికే రత్తము సూసి సెదిరి తోగాల
బుగులేసి కన్నీరు ఒలికి తోగాల
భూతల్లీ సనుబాలు తాగానట్టేరో
తాగానట్టేరో, ఓ ఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ ఓఓ ఓ

కాలువై పారే నీ గుండె నెత్తూరూ, ఊఊఉ
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ

కొమురం భీముడో
కొమురం భీముడో
పుడమి తల్లికి జనమ
హరణ మిస్తివిరో
కొమురం భీముడో…

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment