Home » జిక్కి (Jikki ) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)

జిక్కి (Jikki ) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)

by Vishnu Veera
0 comment

అల్లరిగా అల్లికగా
అల్లేసిందే నన్నే అలవోగ్గా
ఓ లలనా నీ వలనా
మోగిందమ్మో నాలో తిల్లానా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చేయి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

ఆ.. నామనసే నీకే చిక్కి
దిగనందే మబ్బుల్నెక్కి
నీ బొమ్మే చెక్కి రోజు నిన్నే పూజించానే చిక్కి
చెపుతున్న నేనే నొక్కి
పరిచయమే పట్టాలెక్కి
నీ ప్రేమే దక్కి జంటై పోతే ఎవరున్నారే నీకన్నా లక్కీ…

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా దడవును తెంపే నడుం వంపే
నిలువెల్లా చంపే మధువులు నింపే
పెదవంపే ముంచిందే కొంపే
తలగడలేరుగని తలపుల సొదలకు
తలపడుతున్నా నిద్దురతో
తహ తహ లెరిగిన తమకపు
తనువును తడిపేయ్ నువ్వే ముద్దులతో

వింటున్నా నీ గాత్రం
ఏంటంటా నీ ఆత్రం
చూస్తున ఈ చిత్రం
గోలేనా నీ గోత్రం
సాగేనా నీ తంత్రం
పారెనా నీ మంత్రం
కాదనకే నన్నింకేమాత్రం

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చేయి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా వలపుల కుప్పా
నువ్విప్ప ముద్దిస్తే ముప్పా
అలకలు తప్పా ఎంగొప్ప
చనువిస్తే తప్పా

సరసకు చేరిన సరసపు సెగలకు
సతమతమవుతూవున్నానే
గురుతులు చెరగని గడసరి మనసున
గుస గుస లెన్నో విన్నానే

నీ మనసే కావ్యంగా
నీ మాటే శ్రావ్యంగా
నీ పేరే నవ్యంగా
బాగుందోయ్ భవ్యంగా
నువ్వుంటే సవ్యంగా
అవునంటా దివ్యంగా
పెట్టొద్దే నన్నే దూరంగా… దూరంగా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చేయి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే


చిత్రం: మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)
గాయకులు: కార్తీక్ & రమ్య బెహరా
సాహిత్యం: వనమాలి
 సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్ (Harish Shankar.S)
తారాగణం: రవితేజ (Raviteja), భాగ్యశ్రీ బోర్సే (BhagyaShri Borse), జగపతి బాబు (Jagapathi babu) తదితరులు

చిట్టి గువ్వ పిట్టలాంటి (SITAR SONG) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

రెప్పల్ డప్పుల్ (REPPAL DAPPUL SONG) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ బచ్చన్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment