Home » మట్టిలో తేమ ఉందీ (Mattilo Thema Undhi) – జై భీమ్ (JAI BHIM)

మట్టిలో తేమ ఉందీ (Mattilo Thema Undhi) – జై భీమ్ (JAI BHIM)

by Lakshmi Guradasi
4.2K views
Mattilo Thema Undhi song lyrics JAI BHIM

మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ

వెళ్ళే దారుల్లో ఆకాశం తోడుందీ
హద్దే నీకొద్దూ నీ నవ్వే వీడొద్దూ

మట్టిలో తేమ ఉందీ…
రేయికో వెన్నెలుందీ….

పట్టుదల నీ పడవై
దాటు పదా సాగరం
నేలతల్లి నేర్పెకదా
గుండెల్లోని ఓ నిబ్బరం

నిక్కమున్న బాటలోన
నీ పయనం నీకు జయం
ఊపిరున్న కాలమంత
ప్రేమేగా నీకు వరం

ఆశే లేనట్టీ బ్రతుకుందా చెప్పమ్మా
నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మ
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ

మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ

______________________

చిత్రం – జై భీమ్ (JAI BHIM)
సాంగ్ – మట్టిలో తేమ ఉందీ (Mattilo Thema Undhi)
సంగీతం – సీన్ రోల్డాన్ (Sean Roldan)
గాయని – వైకోమ్ విజయలక్ష్మి (Vaikom Vijayalakshmi)
సాహిత్యం – యుగభారతి (Yugabharathi)
నటుడు : సూర్య (Suriya)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.