Nela thally gundalo song lyrics Avunanna Kadanna

నేల తల్లి గుండెలో సాంగ్ లిరిక్స్ (Nela thally gundalo) – ఔనన్నా కాదన్నా 

by Lakshmi Guradasi

నేల తల్లి గుండెలో…
నేల తల్లి గుండెలో…

ఎన్ని వేల పాటలో…
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాల
మద్దెల దరువెయ్యాలా తుళ్ళి పడేలా

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఈ పల్లె పదాలే నోరారా అనాలి
తప్పెట్లే పడాలి రాగానికి
జాబిళ్ళి వినాలి నేలకదే దిగాలి జజ్జినకడి జనారే తాళానికి
వానమ్మ చిందేసి ఆడాలిరా వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా
కొండమ్మ కోనమ్మ మోగాలిరా ఈ గాలి ఈ నేల పల్లవయ్యేలా
తప్పెటలే మోగాల ఉప్పెనలే రేగాల పాట విని పల్లెమ్మ వెంట పడాల

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి కానుకలే ఇవ్వాలి ఈ పాటకి
చిన్నారి చకోరి వాలు కళ్ళు వయ్యారి వెంట మరి పడాలి సయ్యాటకి
ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా
పాపాయిలా పాట ఉయ్యాలలో
పైనున్న ఆకాశం వంగాలిరా
తాతయ్యలా ఈడు తైతక్కలో
మూల నున్న అమ్మమ్మ
మూడుకాళ్ళ ముసలమ్మ
పాట విని రోజంతా చిందులెయ్యాలా

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

___________________

చిత్రం: అవునన్నా కాదన్నా (Avunanna Kadanna)
నటీనటులు: ఉదయ్ కిరణ్ (Uday Kiran), సదా (Sada),
దర్శకుడు: తేజ Teja) ,
సంగీతం: R P పట్నాయక్ (R P Patnaik),
నిర్మాత: పూర్ణ చంద్రరావు (Poorna Chandra Rao),

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like