Home » గెలుపు తలుపులే తీసే సాంగ్ లిరిక్స్ – తీన్ మార్

గెలుపు తలుపులే తీసే సాంగ్ లిరిక్స్ – తీన్ మార్

by Lakshmi Guradasi
1.1K views
Gelupu thalupule song lyrics teenmaar

గెలుపు తలుపులే తీసే
ఆకాశమే నేడు నా కోసమే
అడుగు మెరుపులా మారే
ఆనందమే వీడదీ బంధమే

ఎటువైపూ వెలుతున్నా
వెలుగుల్నే చూస్తున్నా
మెరిసావే రంగుల్లోనా
కల తీరే సమయానా
అల నేనై లేస్తున్నా
అనుకుందే చేసేస్తున్నా

దారులన్ని నాతో పాటుగా
ఊయలూగి పాటే పాడగా
నను వీడి కదలదు కాలమొక క్షణమైనా

గెలుపు తలుపులే తీసే
ఆకాశమే నేడు నా కోసమే

ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే
సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా
చుక్కల్లో చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా
దిక్కుల్ని మీటి వీణగా
చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా

గెలుపు తలుపులే తీసే
ఆకాశమే నేడు నా కోసమే

అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే
ఇవ్వాల గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుందే నీ కలా
ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా
నన్నల్లుకుంటె నువ్విలా
నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే

గెలుపు తలుపులే తీసే
ఆకాశమే నేడు నా కోసమే

_____________________________

సాంగ్ : గెలుపు తలుపులే
చిత్రం: తీన్ మార్ (2011)
తారాగణం: కృతి కర్బందా, పవన్ కళ్యాణ్, త్రిష కృష్ణన్
సంగీత దర్శకుడు: మణి శర్మ
లిరిక్స్: రెహమాన్
గాయకులు: శ్రీరామ చంద్ర

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.