evvari vadalla song lyrics part 2 folk

ఎవ్వరి వాడల్లా (Evvari Vadalla Part 2) సాంగ్ లిరిక్స్ – Dj Folk Song

by Lakshmi Guradasi

ఎవ్వరి వాడల్లా
ఎవ్వరి వాడల్లా ఎళ్ళినవే భామ
ఎవ్వరికి సైగ చేస్తున్నావే భామ
ఎవ్వరికి సిటీ కొట్టినవే భామ

ఆమె: మన ఊరి కులపోళ్ళు
మన ఇంటి పక్కనోళ్లు
నట్లెయ్యబోదామని
నన్ను యెంట పిలిచినారు
ఊరోళ్ళకి సైగ చేస్తున్నారో నేను
కులపోళ్ళకె సిటీ కొట్టిన్నరో నేను

అతడు: ఇంటి పప్పు కుర్ర వదిలేసి వచ్చినావు
స్నానానికె నీళ్లు పెట్టేసి వచ్చినవ్
అందుకనే నిన్ను ఆడిగిననే భామ
మరిచినవేమో అని అడిగితినే భామ

ఎవ్వరి కోసం చీర కట్టినవే భామ
ఎవ్వరి కోసం పూలు పెట్టినవే భామ

ఆమె: మా అమ్మగారోళ్ళు వాళ్ళ ఇంటి మేనోళ్ళు
మా అయ్యనిచ్చినోళ్లు పెళ్లంటూ చెప్పినారు
పెళ్ళికి మంచి చీర కట్టినరో నేను
పెళ్ళికి మల్లెపూలు పెట్టినరో నేను

అతడు: ఓ నీకు మంచి చీర
ని నెత్తి మల్లె పూలు
వెసేటి మొగ్గలేస్తూ
చిరంచు రైక కట్టు
చెప్తుంటే నేనొదును నీతోని భామ
అనుమానమైతే కాదే ప్రేముండి అడిగిననే

ఎవ్వరు నీకు గాజులు పెట్టినారే భామ
ఎవ్వరు నీకు మెరుపులు పుస్తున్నారే భామ

ఆమె: మా మరదలొచ్చిన్నట
గాజులు పెట్టిన్నట
వదిన మరదళ్ల గాజుల రోజున్నట
నా చేతికి గాజులు పెట్టిన్నదో బావ
నా చేతికి చెంపకు మెరుపులు పుసిన్నదో బావ

అతడు: ఓ మాట చెప్పివుంటే చెలెళ్లకు చీర కట్టు
ముచ్చట తెలిసివుంటే నేను కాన అంటూ
ని చేత కోడికూర వండిద్దునే భామ
అనుమానమైతే కాదే ప్రేముండి అడిగిననే

ఎవ్వరికి కల్లోకొచ్చినవే భామ
ఎవ్వరికి కళ్ళు పోసినవే భామ

ఆమె: నా తోడబుట్టినోళ్లు
నా కూడా పెరిగినోళ్ళు
నా నలుగురు అన్నలొస్తే
వాళ్ళ అవ్వకనా ఉంటే
అన్నలకే కళ్ళు తెచ్చినరో నేను
అన్నలకే కళ్ళు పోసిన్నారా నేను

అతడు: ఆ పరుపురాల కళ్ళు బలే తియ్యగున్న కళ్ళు
ఉప్పుచేప తెచ్చి నేను తగ్గిద్దు ముంత కళ్ళు
మురిపెంగా చూసుకుంటానే భామ
అనుమానమైతే కాదు ప్రేముండి అడిగిన్నాను

___________________________________________________

పాట: ఎవ్వరి వాడల్లా (Evvari vadalla)
రచయిత : నాగరాజు కసాని (NAGARAJU KASANI)
గాయని: వీణా (VEENA)& హనుమంత యాదవ్ (HANUMANTHA YADAV)
సంగీతం : అఖిలేష్ గోగు (AKHILESH GOGU)
DJ: లింగ (LINGA)
కెమెరా & ఎడిటింగ్: అరుణ్ కోల్గురి (ARUN KOLGURI)
తారాగణం: జానులిరి (JAANULYRI)& రాజేష్ (RAJESH)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like