Home » దేవుడే దిగి వచ్చినా – సంతోషం

దేవుడే దిగి వచ్చినా – సంతోషం

by Rahila SK
0 comment

పాట: దేవుడే దిగి వచ్చినా
గీత రచయిత: కులశేఖర్
గాయకులు: కే కే, ఉష
చిత్రం: సంతోషం (2002)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్
తారాగణం: గ్రేసీ సింగ్, నాగార్జున, శ్రియ శరణ్


దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా
షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా
ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే

వెన్నెల చూడు నన్నిలా
ఎంత హాయిగా ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకసం
ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం
ప్రేమిస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం

కోయిలా నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనే సంతకం
హాయిగా పీల్చుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామలా నేడు తేలుతూఉంది నా మది
చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమ
అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా

దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా
షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా
ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment