Home » వన్నె సిన్నల సక్కనోడే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

వన్నె సిన్నల సక్కనోడే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comments

వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే

అరె సిగ్గు బిడియాన్నంత వాడు
ఓయ్ దోసుకోని పోయినాడు సూడే
వద్దంటే గుండెల్లో జేరి
అరె పొమ్మంటే పోనే పొడే
వాడు పొమ్మంటే పోనే పొడే

వాడే అందగాడే
అరె సుక్కల్లో సెందురుడే
నన్నే ఏలుకోని
ఓయ్ మహారాణిల చూసుకుంటడే

వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే

అలక మానుకోవ నా అందాల బావ
చేరదీసుకొని జర నన్నేలుకోవ
మనసు ఇడవకుంది నీ మీద ఉన్న యావ
నీ మీద ఉన్న ప్రేమెంటో తెలుసుకోలేవా

సణుగుడు గొణుగుడింక పక్కనెట్టి జూడయ్యో
ఇష్టపడ్డ పిల్లనింత కష్టపెట్టకూ
వలపు వన్నెలున్న సిన్నదాన్ని కాదంటూ
ఆగంగా ఒక్కతీరు ఇడిసిఎల్లకూ
ఆగంగా ఒక్కతీరు ఇడిసిఎల్లకూ

వీడే అల్లరోడే
వరసైన నా వన్నెలాడే
నా వాడే తుంటరోడే
నన్ను ఉన్నసోట ఉండనీయడే

వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే

పొద్దువాలుతుంది వయసు తోడుకోరుకుంది
చెలిమిచేరుకోని నిన్ను సేద తీరమంది
నిలిచి నిన్ను జుడా కంగారు కలుగుతుంది
నను దూరముంచుతుంటే మనసు తల్లడిల్లుతోంది

పరమటబట్టలేక ఎంటబడి వస్తుంటే
సిన్న సూపు జూసి నన్ను బాధపెట్టకూ
సక్కనైన సిన్నదాన్ని తగ్గి జర వస్తుంటే
పొంగిపోయి లేని పోనీ బెట్టు జేయకూ
పొంగిపోయి లేని పోనీ బెట్టు జేయకూ

వీడే అల్లరోడే
వరసైన నా వన్నెలాడే
నా వాడే తుంటరోడే
నన్ను ఉన్నసోట ఉండనీయడే

వన్నె సిన్నల సక్కనోడే
వాడు అందాల సెందురుడే
నన్నుజూసి సైగలు జేస్తాడే
వాడు సూపులతో గుచ్చుతుంటడే


మెరిసేటి మెఘమైన సాంగ్ లిరిక్స్ – జానపద పాట

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకుతెలుగు రీడర్స్ లిరిక్స్ను చుడండి.

You may also like

Leave a Comment