Home » పెదవే పలికిన – నాని

పెదవే పలికిన – నాని

by Haseena SK
0 comment

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే
అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది
ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ

ఆలీ అమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది
ప్రేమ మధురిమా

పొత్తిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపునా పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించన

నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్లు సాకన చల్లగా చల్లగా

ఎదిగి ఎదగని ఓ పసికూన
ముద్దుల కన్నా జో జో
బంగారు కన్నా జో జో బజ్జో లాలి జో

పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి
తదుపరి పంచుతాను ప్రేమ మాధురి

ఎదిగి ఎదగని ఓ పసికూన
ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జో జో
బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment